పల్లెను మింగిన పెట్టుబడి / Pallenu Mingina Pettubadi

ఎస్.ఎ. విద్యాసాగర్ / S.A. Vidyasagar · Economics & Agriculture

పల్లెను మింగిన పెట్టుబడి / Pallenu Mingina Pettubadi book cover

Price: Rs. 225. ఈ పుస్తకం ఐదు సంవత్సరాల కఠోర పరిశ్రమ ఫలితం. గ్రామసీమల్లో ఏమి జరుగుతోంది. గ్రామాల చలనం ఏ దిశగా ఉంది, పాలకుల విధానాలు ప్రజల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయి అనే అంశాల పై రచయిత విద్యాసాగర్ చేసిన పరిశోధనే ఈ గ్రంథం. శ్రీకాకుళం జిల్లా గ్రామాల సూక్ష్మ పరిశీలన ఇక్కడ మనకు క్షుణ్ణంగా కనపడుతుంది. దేశంలోనూ, ఆంధ్రప్రదేశ్లోనూ ఉన్న గ్రామసీమల స్థూల చిత్రణ కూడా మనకు లభిస్తుంది. పరిశోధన అభిమాన దురభిమానాలకు దూరంగా జరిగింది. విషయాలను అధ్యయనం చేయడంలో రచయిత అనుసరించిన పద్దతి సాధ్యమైనంత శాస్త్రీయంగానూ సమగ్రంగానూ ఉందని చెప్పవచ్చు. పరిశోధనా గ్రంథాలకు ఈ పుస్తకం ఒక నమూనాగా నిలుస్తుందని కూడా ఆశించవచ్చు.

Browse more Telugu books