పంచతంత్రం 2 / PANCHTANTRAM 2

sahavasi / సహవాసి · Books

పంచతంత్రం 2 / PANCHTANTRAM 2 book cover

Price: Rs. 112. కథలంటే చెవి కోసుకోనిదెవరు? పిల్లలు, పెద్దలు, అక్షరమ్ముక్క రానివాళ్లు, డొక్క శుద్ధివున్నవాళ్లు, పామరులు, పండితులు అందరూ కథల మీద మనసుపడతారు. కాలగమనంలో ఓ మలుపుగా, జీవనయానంలో ఓ మెరుపుగా భాసించే కథ పుట్టుకకొక అర్థం, పరమార్థం ఉన్నాయి. మనిషి తానెవరో తెలుసుకోవాలన్న తపననుంచి, తపస్సునుంచి కలిగిన ఆత్మజ్ఞానం ద్వారా స్వసుఖం, స్వప్రయోజనాలతో పాటు పరహితం, ప్రజాశ్రేయం సాధించడానికి పంచతంత్రం దోహదం చేసిన తీరు అంచనా కట్టలేనిది. పంచతంత్రం ప్రధానంగా నీతిశాస్త్రం. నీతి అంటే స్థూలంగా చెప్పాలంటే వివేకయుత జీవిత వర్తనం. మానవుడి శక్తియుక్తుల సమరస వికాసం, జీవితంలో భద్రత, సంవద, నిశ్చితకార్యాచరణ, చెలిమి, విద్య, వైదుష్యం అన్నీ చేరి సృష్టించే ఆనందానికి ఆదర్శప్రాయ ప్రతీకగా కళాత్మక కృతిగా పంచతంత్ర నీతిశాస్త్రం దానికదే సాటి. రెండువేల ఏళ్లకు పైగా దేశకాలాలకు అతీతంగా ప్రపంచ ప్రజల్ని అలరిస్తూ వస్తున్న పరిమళభరితమైన ఈ కథల పూలగంప తేలికైన తేటతెలుగులో చదివి ఆనందంలో తేలిపోవాలని కోరే పిన్నలు పెద్దలు అందరికోసం...

Browse more Telugu books