పంచతంత్రం 1 / PANCHTANTRAM 1

sahavasi / సహవాసి · Books

పంచతంత్రం 1 / PANCHTANTRAM 1 book cover

Price: Rs. 112. పండితుల్నీ పామరుల్నీ పిల్లల్నీ పెద్దలనీ ఏక కాలంలో అలరించగలిగిన పుస్తకం పంచతంత్రం. సుమారు రెండు వేల ఏళ్ల నుంచీ సజీవంగా ఉండడమే కాక, ప్రపంచ పాఠకులని ఆనందింప చేస్తున్న గ్రంథమిది. పంచతంత్ర కథలను మొదట ఎవరు చెప్పారు? ఎవరు విన్నారు? మహా పండితుడు విష్ణుశర్మ చెప్పాడనీ, ఆనాటి రాకుమారులు విన్నారనీ అంటారు. ఇదంతా ఒక కథ కాదు. కథల్లో కథలు, ఉప కథలు... కథలు చెప్పడంలో చిన్నా పెద్దా తేడాలేదు; మిత్రులూ శతృవులూ అన్న భేదం లేదు. తనవారా, పరాయివారా అన్న మీమాంస లేదు. పంచతంత్రంలో కథ విననివారుండరు. కథ చెప్పనివారు అరుదు. భార్య భర్తకి కథ చెబుతుంది; భర్త భార్యకు కథ చెబుతాడు. న్యాయమూర్తి నిందితునికి కథ చెబుతాడు; నిందితుడు న్యాయమూర్తికి కథ చెబుతాడు. ఒకరు తన శతృవుకి కథ చెప్పడమూ, ఆ శతృవు శ్రద్ధగా వినడమూ, తిరికి తానొక కథ చెప్పడమూ- ఇదంతా మనకు గమ్మత్తుగా కనిపిస్తుంది. ఇవి కేవలం నీతి కథల సమాహారం కాదు. ఈ కథలు ఆనాటి సమాజపు ఉమ్మడి అనుభవ సారం. అవి మన ఇంగీతాన్ని పెంచుతాయి, మన వివేకానికి పదును పెడతాయి. ఇదుగో. తేట తెలుగులో పంచతంత్రం మీముంది.

Browse more Telugu books