నేను బహువచనం / Nenu Bahuvachanam
Mulugu Rajeshwar Rao / ములుగు రాజేశ్వర్ రావు · Biographies & Auto Biographies

Price: Rs. 162. రాజేశ్వరరావుగారి జీవితం నల్లేరుపై బండి నడకలా సాగవలసిందే. కాని కుటుంబ, సామాజిక పరిస్థితులు ఆ జీవితాన్ని ఎగుడు దిగుడుల మయం చేశాయి. ఆయన ఈ జీవితకథను చదివితే ఇంత ప్రతిభావంతుడి జీవితం ఇలా సాగిందేమిటి? అన్న ప్రశ్న ఎవరికయినా తలెత్తుతుంది. ఆయన అవకాశాలను కల్పించుకోగల సమర్థుడు. కల్పించుకున్నాడు కూడా. కాని అవి సఫలమవుతూ అవుతూ ఎందుకు కూలిపోయాయో! జీవితంలో ఏదో విధంగా పై అంతస్తులకు ఎగబాకే అవకాశాలను ఉపయోగించుకోవాలా? విలువలకు, ఆత్మగౌరవానికి, స్వీయ అభిప్రాయాలకు కట్టుబడి పతనానికైనా (వ్యక్తిత్వంలో కాదు, అంతస్తుల నందుకోవడంలో) సిద్ధపడాలా? అన్న సంశయం ఏర్పడ్డప్పుడు విలువలకు, ఆత్మగౌరవానికి మొగ్గు చూపేవాడే అసలైన మనిషి. ఈ పుస్తకం చదివితే ఎవరైనా ఈ విషయం గ్రహించగలరు. ఆత్మకథ రచయిత కోసం కాదు, మన కోసం. కథాకాలానికి సంబంధించిన సామాజిక అంశాలు, చరిత్ర, ఆయారంగాలలోని లోతుపాతులు. అలాగే సుడిగుండాలవంటి సందర్భాల్లో అలవరచు కోవలసిన నిబ్బరం, వైఫల్యాలను పట్టించుకోకుండా తిరిగి ప్రయత్నాలు ఎలా కొనసాగించవచ్చు.