నేను ఎవరు ? / Who am I?

నాటారు విజయ్ రెడ్డి / NATURI VIJAY REDDY · Books

నేను ఎవరు ? / Who am I? book cover

Price: Rs. 360. సైకాలజీను నేర్చుకోవడం అంటే ఈ ప్రపంచం మొత్తాన్ని జయించడమే... మనస్సును జయిస్తే ఈ ప్రపంచం మొత్తాన్ని జయించినట్లే! అదే మనస్సును జయించకుండా ఈ ప్రపంచం మొత్తాన్ని జయించినా గాని అతడు పరాజితుడే. దీనికి గొప్ప ఉదాహరణ ది గ్రేట్ అలెగ్జాండర్. అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాలి అనే సంకల్పంతో సగం ప్రపంచాన్ని జయించినా కూడా ఎప్పుడూ అసంతృప్తితోనే రగిలిపోతూ ఉండేవాడు. ఎందుకంటే అతను తన మనస్సును మాత్రం జయించలేకపోయాడు. కాబట్టి, మన మనస్సును ఎలా జయించాలో ఈ పుస్తకం స్పష్టంగా చెబుతుంది. ఈ పుస్తకం మొత్తం చదివి అర్థం చేసుకున్న మనిషికి తన జీవితంలో ఇక తిరుగే ఉండదు. ఈ పుస్తకం చదివిన తర్వాత తెలుగులో ఇంతమంచి పుస్తకం ఉందా? అని ఆశ్చర్యపోతారు. నాటారు విజయరెడ్డి!! ఎవరీ రచయిత అని ఒక్కసారిగా పుస్తక ప్రపంచం ఉలిక్కిపడి ఆయనవైపు చూసింది. అత్యంత వేగంగా మొదటి ముద్రణ కాపీలన్నీ అమ్ముడు పోయి రెండవ ముద్రణలోకి రావటం అంటే మాటలా? టీ.వి., మొబైల్ ప్రపంచంలో మునిగిపోయిన పాఠకులకు ఆసక్తి కలిగించి ఈ జనరేషన్లో కూడా ఈ పుస్తక పఠనాన్ని సాధించిన యోధుడు నాటరు విజయరెడ్డి. ఈ రచయిత ద్వారా ఇలాంటి పుస్తకాలు మరిన్నీ రావాలి. తెలుగు బుక్స్ స్థాయిని ఒక్కసారిగా అంతర్జాతీయ స్థాయికి పెంచిన సైకాలజి బుక్ ఇదని నిస్సందేహంగా చెప్పవచ్చు.

Browse more Telugu books