నీహారిక / NIHARIKA
సూరారం శంకర్ / Suraram Shankar · Stories & Poetry

Price: Rs. 225. నిర్భీకుడు, ఆశావాది, సౌందర్యదర్శనం చేసినవాడు అచ్చమైన కవి అనుకుంటే సూరారం శంకర్ స్వచ్ఛమైన కవి. అన్ని రకాల కవిత్వం రాసినా గజల్ ఆయనను కట్టివేసింది. ఇప్పటికే చాలా గజళ్ళు రాశాడు. సంపుటాలు వేశాడు. తెలుగు విశ్వవిద్యాలయ కీర్తిపురస్కారం అందుకున్నాడు. ఎంతోమంది ప్రశంసలు స్వీకరించాడు. అయినా 'కవిత్వమొక తీరని దాహం' గా చెలిమలను, ఒయాసిస్సులను వెతుక్కుంటూ పర్యటిస్తున్నాడు. సృజనవ్యాపారం భిన్న రీతుల్లో జరుగుతుంది. కవిత్వం విషయానికి వస్తే పద్యకవిత, వచనకవిత, మినీకవితలను చెప్పుకుంటున్నారు. కవులు నిత్యనూతనత్వాన్ని కోరుకుంటుంటారు. అందుకే విదేశీయాలైన, గజల్, రుబాయీ ప్రక్రియలను కూడా తెలుగులో పునః సృష్టించుకుంటున్నారు. పారసీ, అరబ్బీ, ఊర్దూలలో బహుళ ప్రచారం పొందినది గజల్. ఇది తెలుగులో కూడా జనాదరణ పొందటానికి కారకులు దాశరథి, సినారెలు. ఆ ప్రక్రియ అవిర్భావ వికాసాలకు వీరే కారకులు. పెన్నా శివరామకృష్ణ గారు గజళ్ళు రాయటమే కాక, గజల్ కవిత్వతాత్వికతను, సౌందర్యాన్ని వ్యాసాల ద్వారా, పుస్తకాల ద్వారా ప్రచారం చేశారు. ఆ రకంగా వారు నడిచే గజల్ సర్వస్వంగా గుర్తింపుపొందారు.