నీలం రంగు నది /NEELAM RANGU NADI
హాథిరామ్ సభావట్ /Hathiram Sabavath · Stories & Poetry

Price: Rs. 120. ముగింపు లేని యుద్ధం యుద్ధం ముగిసింది వదిలి వెళ్ళిన నేలకు వాళ్ళు తిరిగి వస్తున్నారు ఇది ముగింపు కాదని వాళ్లకు తెలుసు అలసిపోయిన కన్నీళ్ళకు ఒక చిన్న విరామం ఆలివ్ చెట్ల దారుల్లో పేరుకుపోయిన శవాలను పూడ్చడానికి వాళ్ళు తిరిగి వస్తున్నారు. విచ్ఛిన్నమైన తల్లి గర్భంలో శిథిలమైన జీవిత అవశేషాల కోసం తిరిగి వస్తున్నారు సరిహద్దుల లోపల పసిపిల్లల చావులతో అసంపూర్ణంగా మారిన ఆ వీధుల్లో యుద్ధం ముగిసిందన్న వార్తను అనుమానిస్తూ నిద్రపోయే ముందు యుద్ధం లేని ప్రపంచాన్ని ఊహించుకోవడానికి వాళ్ళు తిరిగి వస్తున్నారు