నిజ జీవిత కథలు/Nija jeevitha Kathalu

కవిత బేతి • ప్రసన్న కిరణ్ • పురుషోత్తం సతీష్ · Biographies & Auto Biographies

నిజ జీవిత కథలు/Nija jeevitha Kathalu book cover

Price: Rs. 145. మన జీవితంలో ఆనందాలు, అనుభూతులు, ఎన్నో మలుపులు, కష్టనష్టాలు, ఒడిదుడుకులు, విజయాలు, సందర్భానికి తగినట్టు మనం తీసుకున్న నిర్ణయాలు, సాధించిన ఘనతలు ఎవరితోనైనా పంచుకోవాలని అనుకోవడం సహజం. ప్రతి జీవితం ఏదో ఒక నీతి, ఒక పాఠం నేర్పిస్తుంది. అలా మన లేదా మనకి తెలిసిన వారి గురించి ప్రపంచానికి ఒక కథగా, ఒక పాఠంగా తెలిపేదే ఈ 'నిజ జీవిత కథలు' సంకలనం. 'ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు' అనే సూక్తి సార్థకం అయ్యేలా తమ జీవితాలను ఆదర్శవంతంగా తీర్చి దిద్దుకొని మరెందరికో ప్రేరణగా నిలుస్తున్న మహానుభావుల జీవితాలు, నిజానికి మన అందరి జీవితాలకు మార్గదర్శకాలు, మార్గసూచకాలు. నిజజీవిత కథలను సాహిత్యరూపంలో మలిచి మీకు బహూకరించే ఈ బృహత్తర కార్యంలో భాగస్వామినై ఉండటం నాకు ఆనందదాయకం మరియు గర్వకారణం. జీవితంలోని ప్రతికూలమైన అంశాలను కూడా అనుకూలంగా మార్చుకునే అవకాశాలు తెలుసుకునే ప్రయత్నంలో సాగిన ప్రయాణమే ఈ సందేశాత్మక పుస్తకం. శూన్యం నుండి ఆకాశం వైపు ఎదిగిన జీవితాల గురించి తెలుసుకోవటం చదువరులను అలోచింప జేస్తుంది. ప్రతి ఒక్కరి జీవితంలోని ఏదో ఒక సంఘటన విధానాత్మక నిర్ణయం ఇందులో ప్రతిబింబించడం జరిగింది. ఈ పుస్తకం మా అందరి సమిష్టి కృషి.

Browse more Telugu books