నికోలాయ్ గోగోల్ / NICOLAI GOGOL
సుబ్బు / Subbu · Novels

Price: Rs. 55. గవర్నమెంట్ ఇన్స్పెక్టర్ ఆనాటి రష్యన్ అధికారవర్గాలకు చాలా చికాకు కలిగించింది. ఈ నాటకంలో గొగోల్ వారిని తిట్టలేదు. కొట్టలేదు. ఆటపట్టించాడు. వాళ్ల నీచత్వాన్ని నవ్వుతూ నవ్వుతూనే ఎండగట్టాడు. మృతజీవులు నవలకంటే గవర్నమెంట్ ఇన్స్పెక్టర్ నాటకం ముందు వెలువడింది. గొగోల్ దాదాపు 200 సంవత్సరాల క్రితం పుట్టాడు. సుమారు 150 ఏళ్ల క్రితం చనిపోయాడు. ఆధునిక రష్యన్ కథా సాహిత్యం గొగోల్ ఓవర్ కోటు నుంచే పుట్టిందంటారు. ఓవర్ కోటు, తారాస్ బుల్టా, ముక్కు తదితర గోగోల్ కథలు ఆనాటి రష్యన్ పాఠకులను అలరించాయి. అందితే జుత్తు, అందకుంటే కాళ్లు పట్టుకొనే రష్యన్ అధికారవర్గాల తీరుని గవర్నమెంట్ ఇన్స్పెక్టర్ కళ్లకు కడుతుంది. ప్రజల ఎడల వారు ఎంత కర్కశంగా ప్రవర్తించారో పై అధికారుల ఎదుట అంత కుక్కిన పేనుల్లా మసులుకున్నారన్న సంగతిని గవర్నమెంట్ ఇన్స్పెక్టర్ చూపుతుంది. ఆనాటి రష్యా రాజరికంలో ఉంది. ఇవాళ్ళి మన 'ప్రజాతంత్ర' భారత అధికారవర్గాలను సరదాకి ఈ నాటకంలో పాత్రలతో పోల్చి చూడండి. ఎవరు ఘటికులో మీకే తెలుస్తుంది.