నా ఆయుధం కవిత్వమే / Naa Aayudham Kavitvame

N. venugopal / వేణుగోపాల్ · Stories & Poetry

నా ఆయుధం కవిత్వమే / Naa Aayudham Kavitvame book cover

Price: Rs. 198. అనువాదకుడిగా నాకు మాత్రం కవితానువాదం ఒక అద్భుతమైన, సంతృప్తికరమైన, సార్ధకమైనదనిపించే అనుభవం. అనువాదం ద్వారా పరభాషా కవిత్వంతో, కవితో, ఆ నేపథ్యంతో కలిగిన సంబంధం, సంభాషణ, సంవాదం, కొత్త ఎరుక ఒక గొప్ప అనుభవం. ఆ అనుభవంలో అనేక స్థాయిల, పొరల అనుభూతులు, ప్రయోజనాలు, సామర్ధ్యాలు, అవగాహనలు, వాతావరణాలు ఇమిడి ఉంటాయి. ఆ కవి గురించి తెలిసినా తెలియకపోయినా కవిత నచ్చి, అది మన భాషా పాఠకులకు పరిచయం కావాలనే కోరికతో అనువాదం చేయవచ్చు. కవిత నచ్చడం అన్నప్పుడు దాని వస్తు శక్తి కావచ్చు, లేదా ఆ శైలీ శిల్పాల ఆకర్షణ కావచ్చు. ఆ కవి గురించి తెలిసినందువల్ల ఆ కవినీ సందర్భాన్నీ పరిచయం చేయడానికి అనువాదం చేయవచ్చు. లేదా, ప్రస్తుతం మన చుట్టూ ఉన్న వాతావరణం ఒక కవితా సందేశాన్ని కోరుతున్నప్పుడు, అది మరే భాషలోనైనా దొరుకుతుందా అని వెతుకులాటలో దొరికిన కవితను అనువాదం చేయవచ్చు. లేదా ఒక రాజకీయార్ధిక, సామాజిక, సాంస్కృతిక సందర్భాన్ని వివరిస్తున్నప్పుడు, ఆ సందర్భానికి తగిన కవిత్వం జోడిస్తే ఆ వివరణకు బలం చేకూరుతుందని, అందుకు తగిన కవితలు అనువాదం చేయవచ్చు.

Browse more Telugu books