నవల వెనక కథ / NAVALA VENAKA KATHA

మల్లాది వెంకట కృష్ణమూర్తి / Malladi venkata krishnamurthy · Novels

నవల వెనక కథ / NAVALA VENAKA KATHA book cover

Price: Rs. 540. ఫిబ్రవరి 1970 నించి మల్లాది వెంకట కృష్ణమూర్తి రచనలు చేస్తున్నారు. మొదటి కథ ప్రచురించబడ్డ ఆగస్ట్ 1970 నించి ఆగస్ట్ 2020కి 50 ఏళ్ళు నిండిన సందర్భంగా ఈ పుస్తకాన్ని వెలువరిస్తున్నాం. మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన 106 నవలలకి ఐడియా ఎలా వచ్చింది, వాటిని నవలలుగా రూపొందించిన విధానం, వాటి సినిమా, టి.విల చిత్రీకరణ అనుభవాలు మొదలైనవి ఇందులో విశదపరిచారు. ఇది రచయితలకి కూడా ఎడ్యుకేటివ్ ఉంటుంది. ఇందులో 'అనుబంధం' విభాగంలో 1960 నించి తెలుగు నవలావిహంగ వీక్షణం, మల్లాది వెంకట కృష్ణమూర్తి వివిధ పత్రికలకి ఇచ్చిన ఇంటర్వ్యూలు, వివిధ పత్రికలలో నిర్వహించిన శీర్షికల వివరాలు, సినిమాలుగా వచ్చిన నవలల వివరాలు, ఇతర పుస్తకాల పరిచయం మొదలైనవి చదవచ్చు. మల్లాది వెంకట కృష్ణమూర్తిని రచయితగా పరిపూర్ణంగా ఆవిష్కరించే ఈ పుస్తకం, నవలలు చదివే అలవాటు లేని వారికి కూడా వాటి మీద అవగాహనని కలిగిస్తుంది.

Browse more Telugu books