ధర్మావరణం వ్యాసమాలిక / DHARMAVARANAM VYASAMALIKA
డి. చంద్రశేఖర్ / D. CHANDRASEKHAR · Education & Science

Price: Rs. 120. బుద్ధుని బోధనలు, మన సమాజంపై వాటి ప్రభావం గురించి తెలుగునాట కొన్ని నిరాధారమైన అపోహలు, ఆరోపణలు, అభిప్రాయాలు ప్రచారంలో ఉన్నాయి. ఇప్పుడు, ప్రామాణిక బుద్దవచనంపై ఆధారపడిన తెలుగు రచనల అవసరం ఎంతైనా ఉంది. ఈ దిశగా, గత ఐదు సంవత్సరాలుగా వివిధ పత్రికల కోసం శ్రీ డి.చంద్రశేఖర్ రాసిన కొన్ని వ్యాసాలు, విమర్శలను ఒక సంకలనంగా అందిస్తున్నాం. దీనిలో, నేటి కాలానికి బుద్ధుని బోధనల ఆవశ్యకతను వివరించే వ్యాసాలు, బుద్ధవచనంలో ముఖ్యమైన కొన్ని అంశాలను లోతుగా విశ్లేషించిన వ్యాసాలు, బౌద్ధంపై ప్రచారంలో ఉన్న కొన్ని అపోహలకు, విమర్శలకు సమాధానం చెప్పిన రచనలు ఉన్నాయి.