ద బ్రెయిన్ / The Brain
విజయ్ రెడ్డి / VIJAY REDDY · Education & Science

Price: Rs. 225. బ్రెయిన్ / మనస్సు / అంతరాత్మ / అచేతనపు లోతులను, అగాధాలను, అంతర్గత ప్రవర్తనను నీకు నీవుగా తెలుసుకునేలా చేసి నిన్ను అత్యంత శక్తివంతంగా తయారు చేసే అతి శక్తివంతమైన పుస్తకం ఇది. మనకు కొన్ని భయాలు ఉంటాయి! ఆ భయాల మన మనస్సులో ఎలా ఏర్పడ్డాయి? మన చుట్టూ వున్న మనుషులు, మన ఇంట్లో వున్న మనుషులు ఇలా/అలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు. ఇలా/అలా ఎందుకు మాట్లాడుతున్నారు? వాళ్ళ ప్రవర్తన వెనుక, మాటల వెనుక అంతర్గత కారణాలు మనకు తెలిస్తే ఎంత మజాగా ఉంటుందో ఆలోచించండి! మనం అత్యంత ఉత్తమంగా జీవించాలంటే, మనం ఇతరుల సైకాలజీ తెలుసుకోవలసిన అవసరం వుంది. మన గురించి మనం తెలుసుకోవటానికి మన జీవితంలో ఎదురయ్యే వ్యక్తుల గురించి మరింత తెలుగుసుకోవటానికి ఇది గొప్ప అవకాశం. మన ఉద్యోగంలో, వ్యాపారంలో మనకు ఎంతో మంది తారసపడుతూ ఉంటారు. వాళ్ళ అంతర్గత ప్రవర్తననలను, ఆలోచనలను అర్థం చేసుకోగలిగితే ఇంకా అద్భుతంగా జీవించగలుగుతాము. ఇవన్నీ జరగాలంటే మనం సైకాలజీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మార్కెటింగ్ / సేల్స్ / బిజినెస్ కస్టమర్ రిలేషన్స్ / టైమ్ మేనేజ్మెంట్ ఇంటర్వ్యూ / ఉద్యోగం / చదువు / స్టేజ్ ఫియర్ ఆరోగ్య సంరక్షణ/సామాజిక లైంగిక జీవితం ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవడానికి ఈ "సైకాలజీ" పుస్తకం మనకు పూర్తిగా సహాయపడుతుంది. మనస్తత్వ శాస్త్ర పరిజ్ఞానం ఈ పుస్తకంలో ప్రతి విభాగంలో మనకు సహాయకరంగా ఉంటుంది. ఈ పుస్తకం చదివిన ప్రతి ఒక్కరికి తమ బ్రెయిన్ గురించి పూర్తి అవగాహన కలుగుతుంది. అంతేకాక ఎదుటి వ్యక్తి గురించి, వారి అంతర్గత ఆలోచనల గురించి, ప్రవర్తన గురించి కూడా పూర్తి అవగాహన కలుగుతుంది. తద్వారా మన జీవితాన్ని ఉన్నతంగా జీవిస్తూ... సక్సెస్ అవుతాము.