దైవమిచ్చిన భార్య / Daivamicchina Bharya
chalam / చలం · Novels

Price: Rs. 99. "తెలుగు సాహిత్యంలో ఎవరికీ లేని ప్రత్యేకత చలంది. తనను తాను అన్వేషించుకుంటూ ఒక వ్యక్తి ఎంతదూరం ప్రయాణించగలడో అంత దూరం ప్రయాణం చేసిన వ్యక్తి చలం. మొహమాటం లేకుండా, లోకనిందకు జంకకుండా తన ప్రయాణాన్నంతా రచనల్లో కూర్చిన వ్యక్తి.” 1894 మే 19న జన్మించిన చలం నవలలు, కథలు, కవితా రచనలు, రూపకాలు, ఏకాంకికలు, అనువాద రచనలు మిక్కిలిగా చేశారు. ఇంకా చరిత్రలు, వ్యాసాలు, లేఖలు, పీఠికలు, వేలకొలది ఉత్తరాలు వెలువరించారు. చలం జీవితం, సాహిత్యం మీద అనేక వ్యాసాలు, పుస్తకాలు వచ్చాయి. 1979 మే 4న కనుమూశారు. +++ “కుటుంబ వ్యవస్థకు వ్యవస్థాబద్ధంకాని ప్రేమకు మధ్య పంపిణీ కుదరక పురుషలోకం స్త్రీ హృదయాన్నే కోల్పోతుంది. రక్షణ, గౌరవాల కోసం భర్త - ప్రేమ కోసం ప్రియుడు, ఇద్దరూ కావాలి. ఈ స్థితిలో రహస్య ప్రణయమే శరణ్యం. చట్టాన్ని వ్యతిరేకించి ప్రేమను వరించిన స్త్రీ జీవితం విషాదాంతం అవుతుంది. స్త్రీ స్వాతంత్య్రం ప్రేమకు చట్టానికి మధ్య పడి నలిగి చేసే ఆక్రందనను చిత్రించారు, ఈ నవలలో.”