దళిత బహుజన సాహిత్య యుగం / DALITHA BAHUJANA SAHITYA YUGAM
బి.ఎస్. రాములు / B. S. RAMULU · History

Price: Rs. 315. 1992 నుండి 2010 మధ్య కాలంలో దరకమే ఐక్యవేదిక స్ఫూర్తితో ఎందరో ఎదిగి వచ్చారు. మారోజు వీరన్న, ఏటుకూరి బలరామమూర్తి విశాలాంధ్ర ప్రచురణా లయం సంపాదకులు, ఎస్వీ సత్యనారాయణ, ఖాదర్ మొహియుద్దీన్, ఉషా ఎస్. డానీ, షరీఫ్, నల్లా సూర్యప్రకాష్ బిఎస్పీ, చండ్ర రాజేశ్వరరావు, తమ్మినేని వీరభద్రం, తెల్కపల్లి రవి, గణపతి, కూర రాజన్న, వరవరరావు, గద్దర్, వంగపండు, కారా, కొత్తపల్లి రవిబాబు, సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్, మావోయిస్టు, కాంగ్రెసు, తెలుగు దేశం పార్టీలు ఉద్యమాలు తమను తాము సమీక్షించుకున్నాయి. చరిత్రాత్మకమైన దరకమే ఐక్యవేదిక కృషిని, చరిత్రను యువతరానికి అందించాల్సిన అవసరం ఉంది. ఇవాళ అరసం, విరసం, జనసాహితీ సాంస్కృతిక సమాఖ్య, అరుణోదయ, జననాట్య మండలి, ప్రజానాట్య మండలి, తెలంగాణ ధూం ధాం, తెలంగాణ సాంస్కృతిక వేదిక, తెలంగాణ రచయితల వేదిక, కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి, కుల నిర్మూలన పోరాట కమిటీ వంటి సంస్థలు కుల సమస్యను పట్టించుకున్నాయంటే అదంతా దరకమే ఐక్యవేదిక ఖాతాకే జమవుతుంది. ఇలా వారంతా మారిన క్రమంలో అవసరమైన విషయాలపట్ల అందరం కలిసి పనిచేస్తూ రావడం జరుగుతున్నది. కనుక ఆనాటి సంఘర్షణలు, ఆవేశకావేశాలు ఈనాడు ఉన్నాయని అనుకోకూడదు. ఈ చర్చల్లో ఎంతోమంది సాహితీవేత్తలు, జర్నలిస్టులు, సంపాదకులు, కళాకారులు పాల్గొని అనుకూలంగా, వ్యతిరేకంగా చర్చించి ఒక స్పష్టతను ఇచ్చారు. మొదటి రాష్ట్ర మహాసభల్లో బి.ఎస్. రాములు అధ్యక్షులుగా, మాస్టార్జీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1995 మేలో వరంగల్ లో జరిగిన రాష్ట్ర మహాసభల్లో అధ్యక్షులుగా ఆచార్య ననుమాస స్వామి, అనిశెట్టి రజిత ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆ క్రమంలో మాస్టార్జీ, ఉ. సాంబశివరావు, కె. రామలక్ష్మణ్, గూడ అంజయ్య, ఇంగిలాల రామచందర్రావు, కె. సీతారాములు, ఎం. అనంతయ్య, వి.జి.ఆర్. నారగోని, రాష్ట్ర అధ్యక్షులుగా, కార్యదర్శులుగా ఎన్నికవుతూ వచ్చారు. మూడు దశాబ్దాలుగా వందలాది రచయితలు, కళాకారులు, జర్నలిస్టులు, గాయకులు, విద్యావంతులు బహుజన సాహిత్య సామాజిక ఉద్యమాల్లో పనిచేస్తున్నారు. అనేక కొత్త తరాల