దళితుల చరిత్ర 7వ భాగం / History of Dalits Part 7

డా॥ కత్తి పద్మారావు / Dr. Katti Padma Rao · History

దళితుల చరిత్ర 7వ భాగం / History of Dalits Part 7 book cover

Price: Rs. 270. మహాకవి డా. కత్తి పద్మారావు గారు దళితోద్యమకారుడే కాక దళితుల చరిత్ర నిర్మాణ కర్త దళితుల ఆత్మ గౌరవం ప్రదీపించడం కోసం వారి మూలాలను పరిశోధించి దళితుల చరిత్ర పేరుతో సంపుటాలు వరుసగా వెలువరిస్తున్నారు. అందులో ఇది 7 వ భాగం. ఇందులో దళితుల చారిత్రక మూలాలు, భారతదేశ సంస్కృతి నిర్మాతలు, దక్షిణ భారత నిర్మాతలుగా దళితులు, భారతదేశ సృష్టి కర్తలు మూలవాసులే. దేశీయ జాతులు తొక్కేసిన వలసలు, భారతదేశం చారిత్రక క్రమం, మనిషిపై ద్వేషం-జంతువుల పూజ, పరిశోధకునిగా అంబేడ్కర్, అంబేడ్కర్ వేదాల పరిశోధన. భారతదేశ మూలాలు-అంబేడ్కర్, దళితులను అణచివేసే కథనం - ఇలా 11 చాప్టర్లుగా విభజించి రాయడం జరిగింది. ఈ గ్రంధం అధ్యయనం వలన నిజమైన చరిత్ర, భారతదేశ చరిత్ర దళితులదే అని అర్థమౌతుంది. డా. బి.ఆర్. అంబేడ్కర్ సామాజిక చారిత్రక దృక్పధంతో ఈ గ్రంధాలు రాయడం జరుగుతుంది.ఈ గ్రంధాధ్యయనాల వలన కాలేజీల్లో, విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు, ఉద్యమకార్యకర్తలకు, యువకులకు, భారతదేశందళితులు నిర్మించిందేనని అర్థమౌతుంది. ఇంతకు ముందు వచ్చిన దళితుల చరిత్ర 6 భాగాలను స్వీకరించినట్టే ఈ 7వ భాగాన్ని కూడా మీ కరదీపికగా చేసుకుని నూత్న చారిత్రక దృక్పధంతో ముందుకు నడుపుతారని ఆశిస్తున్నాము. ఈ గ్రంధం మహాకవి డా. కత్తి పద్మారావు గారి 74వ రచన. లోకాయుత ప్రచురణలను నిరంతరం ప్రోత్సహిస్తున్న పాఠకులందరికీ కృతజ్ఞతలు.

Browse more Telugu books