దళితుల చరిత్ర 1,2,3,4 భాగాలు / Dalithula Charitra 1, 2, 3, 4 Parts
డా॥ కత్తి పద్మారావు / Dr. Katti Padmarao · History

Price: Rs. 360. బ్రాహ్మణ వాద చరిత్రకు ప్రత్యామ్నాయ చరిత్ర దళితుల చరిత్ర, దళితుల చరిత్ర ముందు 1. 2, 3. భాగాలు ప్రచురించాం. ఇపుడు 4 భాగాలు కలిపి ప్రచురిస్తున్నాము. ఈ గ్రంథంలో మహాకవి డా. కత్తి పద్మారావు గారు చరిత్ర మూలాలను త్రవ్వి తీశారు చరిత్ర పురాతత్వ శాస్త్రం, వేదాలు, దర్శనాలు, పురాణాలు అన్నీ సత్సమాణంగా చదివి రాసిన గ్రంథం ఇది. ఈ గ్రంథం వచ్చాకే ప్రత్యామ్నాయ దళిత నాయకుల గురించి భారతదేశానికి తెలిసింది. విశ్వవిద్యాలయాల్లో దళిత ప్రత్యామ్నాయ నూతన చైతన్యం వచ్చింది. ప్రతి ఒక్క దళితుడు. బహుజనుడు తన చరిత్ర తాను తెలుసుకోవడానికి ఈ గ్రంథం కరదీపిక అవుతుంది. అసలు నిజమైన భారతదేశ చరిత్ర ఏదో మీ కళ్ళముందు సాక్షాత్కరింపబడుతుంది.. ఈ గ్రంథం ఈ ముద్రణలో మీకు సందర్భోచిత చిత్రాలతో మీకు అందిస్తున్నాము. ఈ గ్రంథం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా ప్రచురించడం మరియు డా. కత్తి పద్మారావు గారికి లోక్ నాయక్ ఫౌండేషన్ అవార్డు స్వీకరణ సందర్భంగా ఆవిష్కరింపబడడం ఒక చారిత్రక సందర్భంగా భావిస్తున్నాం.