దక్కన్ గోండుల చరిత్ర / Dakkan Gondula Charitra
Bhangya Bhukya / భంగ్య భూక్య · History

Price: Rs. 135. "మీరు మాకు ఇస్తున్నది చాలా తక్కువ. రాజ్యాంగం మీది. సరిహద్దులు మీవి. సార్వభౌమాధికారం మీది. జెండా మీది. మాకేం దక్కింది? రాజ్యాంగంలో ఆదివాసి, భారతీయ రెండూ కలిసి ఉన్న విషయం ఒక్కటి చెప్పండి. పంచుకున్న వారసత్వం గాని, ఉమ్మడితనం గాని ఏముందో చెప్పండి. హక్కుల్ని, ఇజాలను, పరిశ్రమను, సైన్సును అన్నిటినీ మీరే నిర్వచించారు. మాదైన నిర్వచనం కూడా ఒకటి ఉంచండి." - జైపాల్ సింగ్ ముండా జవహర్లాల్ నెహ్రూకిచ్చిన సమాధానం కొన్ని జాతులు ఎందుకు మొరటు జీవనం సాగిస్తున్నాయి? ఎందుకు కుల సమాజానికి దూరంగా కొండల్లో, అడవుల్లో జీవిస్తున్నాయి? గొప్పదిగా చెప్పుకునే మన నాగరికత ఎందుకు కొండ ప్రాంతాలను చేరడం లేదు? వాటికి జవాబుల వెతుకులాటే ఈ పుస్తకం.