తెల్ల కోర / TELLA KORA

పిళ్లా వెంకటేశ్వరరావు / Pilla Venkateswara Rao · Novels

తెల్ల కోర / TELLA KORA book cover

Price: Rs. 112. జాక్ లండన్ కలం నుంచి జాలువారిన మరో కుక్క కథే ఈ తెల్లకోర. తెల్లకోర నిజానికి సగం కుక్క సగం తోడేలు. బక్ పుట్టింది నాగరిక ప్రపంచంలో. అడవి దాని గమ్యం అయింది. తెల్లకోర పుట్టింది అడవిలో. దాని గమ్యస్థానం మాత్రం ఒక మహా నగరం. ఈ రెండు కథల్లోనూ భౌతిక పరిస్థితులు ప్రాణులమీద ఎటువంటి ప్రభావం కలిగిస్తాయో మనం చూస్తాం. పరిస్థితులు మారినప్పుడు వాటికి అనుగుణంగా మారగలిగిన జీవే బతికి బట్టగడుతుంది. ఈ సూత్రాన్ని అర్థం చేసుకొన్న మీ బాలలు జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలను ఎదుర్కోడానికి మానసికంగా సన్నద్ధులవుతారు. బక్గానే తెల్లకోర కథనం కూడా ఉత్కంఠ భరితం.

Browse more Telugu books