తెలుగు సాహిత్య చరిత్ర / TELUGU SAHITHYA CHRITRA

వెలమల సిమ్మన్న/ VELAMALA SIMMANNA · History

తెలుగు సాహిత్య చరిత్ర / TELUGU SAHITHYA CHRITRA book cover

Price: Rs. 675. చరిత్రను విస్మరించినవాడు చరిత్రను సృష్టించలేడు". అని డా॥బి.ఆర్. అంబేద్కర్ అన్నట్లు అన్ని రంగాల చరిత్రను అధ్యయనం చేయడం, ఆకళింపు చేసుకోవడం. అని వార్యంగా అవసరమౌతుంది. "తెలుగు సాహిత్య చరిత్రను" తెలియజేసే గ్రంథాలు ఆయాకాలాల్లో అనేక మంది రాశారు. విద్యార్థులకు, ఆధ్యాపకులకు, సాహితీ ప్రియులకు సమగ్రంగా సరళీకృతంగా చేసి సుస్పష్టంగా అందించడానికి ఆచార్య వెలమల సిమ్మన్న గారు వెలువరిస్తున్న "తెలుగు సాహిత్య చరిత్ర" మిక్కిలి ఉపయుక్తం. మూడు దశబ్దాల బోధనానుభవం, నిరంతర పరిశ్రమ దాదాపు అన్ని పాఠ్యాంశాలపై సాధికారికమైన ఆధిపత్యాన్ని సంతరించుకోవడానికి వీరికి ఉపకరించింది. గతంలో వీరు తెలుగు భాషాచరిత్ర, తెలుగు సాహిత్య విమర్శ సిద్ధాంతాలు, ఆధునిక భాషా శాస్త్రం లాంటి ప్రామాణిక గ్రంథాల్ని రాసి ప్రముఖుల ప్రశంసల్ని అందుకున్నారు.. అవి అనతి కాలంలో అనేక ముద్రణలు పొందాయనేది చారిత్రక సత్యం. ఇప్పటివరకు వీరు రాసిన గ్రంథాలు 82కి పైగా వుండడం, అపన్నీ దళిత సాహిత్య పీఠం ప్రచురించడం ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన విషయం. డా॥ బి.ఆర్.అంబేద్కర్ శత జయంతి సందర్భంగా ఏర్పడిన దళిత సాహిత్య పీఠం గ్రంథ ప్రచురణల్లో వైశిష్ట్యాన్ని కనపరస్తూ తన ఉనికిని చాటుకుంది. ఆచార్య వెలమల వారు "తెలుగు సాహిత్య చరిత్ర" ను ప్రచురించడం ఒక చారిత్రక అవసరంగా భావిస్తున్నాం. ప్రాఙ్నన్నయ యుగం నుంచి అత్యాధునికమైన 'రెక్కలు' ప్రక్రియ వరకు వచ్చిన చిన్న చిన్న ప్రక్రియల్ని కూడా తన సాహిత్య చరిత్రలో స్థానం కల్పించడంతో ఈ రచనకు సంపూర్ణత్వం సమకూరింది. ఈ గ్రంథం కూడా మీ ఆదరణకు నోచుకుంటుందని భావిస్తాం.

Browse more Telugu books