తెలుగు సామెతలు / TELUGU SAMETHALU

Editor · Novels

తెలుగు సామెతలు / TELUGU SAMETHALU book cover

Price: Rs. 75. అంకె లేని కోతి లంకంతా చెరిచిందిట. అంగడి అమ్మి గొంగడి కొన్నట్లు. అంగట్లో అన్నీ ఉన్నాయి కానీ అల్లుడి నోట్లో శని ఉంది. అంగట్లో అష్టభాగ్యం, అల్లుని నోట్లో శనేశ్వరం (అష్టదరిద్రం). అంగట్లో అరువు, తల మీద బరువు. అంగట్లో బెల్లం, గుళ్ళోలింగానికి నైవేద్యం. అంగాన ఆట సాగితే మద్దెలకానిని బయట పెట్టిందిట. అంగిట బెల్లం, ఆత్మలో విషం. అంచు డాబేకాని, పంచె డాబు లేదు. అంటనప్పుడు ఆముదము రాసుకున్నా అంటదు. అడుగులోనే అరక విరిగిందట. అదునూ పదునూ కనిపెట్టి చల్లాలి. అన్ని రోగాలకూ వాతలు వేసే వైద్యుడ్ని అవతల వుంచు. అనూరాధ కార్తెలో అనాథ కర్రయినా ఈనుతుంది. అశ్వని కురిస్తే అడుగు తడవదు. అంటే ఆరడి అవుతుంది. అనకుంటే అలుసవుతుంది. అండలుంటే కొండలు దాటవచ్చు.

Browse more Telugu books