తెలుగు కథా పూతోట / Telugu story flower garden

కుమార్ కూనపరాజు / Kumar Kunaparaju · Books

తెలుగు కథా పూతోట / Telugu story flower garden book cover

Price: Rs. 225. కథానిక పుట్టినప్పటి నుంచీ దానికిపత్రికలే ఆలంబనగా వున్నాయి. కథానికను ఒక సాహిత్య ప్రక్రియగా రూపుదిద్దిన తొలినాటి మహారచయితలు ఎడ్గార్ ఎలాన్ పో, చెకోవ్, మపాసా, ఓ హెన్రీ, రవీంద్రనాథ్ ఠాగూర్ ల రచనలు కూడా పత్రికల్లోనే వచ్చాయి. 19వ శతాబ్దం తొలినాళ్లలో పుట్టిన కథానికా ప్రక్రియలో తొలి పోటీలు 1950 తరువాతే నిర్వహించబడినట్టు తెలుస్తోంది. కథానికా పోటీలను తలచుకుంటూనే తెలుగు వాళ్ళందరూ హెరాల్డ్ ట్రిబ్యూన్ పత్రికలో 1952లో ప్రపంచ స్థాయిలో రెండవ బహుమతి గెలుచుకున్న పాలగుమ్మి పద్మరాజుగారి గాలివానను గుర్తుకు తెచ్చుకుంటారు. ఆ తరువాతి సంవత్సరంలో ట్రిబ్యూన్ పత్రిక కోసం తెలుగు భాష నుంచి ఎన్నిక చేసిన నాలుగు కథలను భారతి పత్రికలో ప్రచురించారు.

Browse more Telugu books