తెలంగాణ సాయుధ పోరాటం / TELANGANA SAYUDHA POORATAM

దొడ్డా నరసయ్య / Dodda Narasaiah · Telangana Literature

తెలంగాణ సాయుధ పోరాటం / TELANGANA SAYUDHA POORATAM book cover

Price: Rs. 75. 1914 అక్టోబరు నెలలో హుజూర్నగర్ తాలూకా చిలుకూరు గ్రామములో పేదరైతు కుటుంబములో జన్మించారు. ఆప్పర్ ప్రైమరీ స్కూలులో ఉర్దూ మీడియంలో ఐదవ తరగతి వరకు చదువుకున్నారు. బతుకుదెరువు కోసం కొంతకాలం ప్రైవేటు గుమస్తాగా జీవితం సాగుతుండగా 1941 జూన్లో స్వగ్రామమైన చిలుకూరులో శ్రీ రావి నారాయణరెడ్డిగారి ఆధ్యక్షతన 8వ ఆంధ్ర మహాసభ జరిగింది. చరిత్రాత్మకమైన ఆ మహాసభ ఏర్పాట్లలో భాగస్వామిగా రాజకీయ జీవితం ప్రారంభమయింది - గ్రంథాలయాలు, అంటరానితనముతో పాటు నిర్బంధ వెట్టిచాకిరికి వ్యతిరేకంగా, లెవీ గల్లా నిరోధక కార్యక్రమం ద్వారా తాలూకాలో ఆంధ్రమహాసభ వ్యాప్తికి కృషిచేశారు. అరెస్టు వారంట్ రావడంతో 1946లో రహస్య జీవితం గడిపారు. 1953లో అరెస్టు అయ్యే వరకు 8 సంవత్సరాలు రహస్య జీవితం కొనసాగించారు. చరిత్రాత్మకమైన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటములో గెరిల్లాదళ కమాండరుగా, 400 మందితో ఏర్పడ్డ కంపెనీదళ కమాండరుగా, సాయుధ దాడులలో ప్రత్యక్షముగా పాల్గొన్నారు. హుజూర్ నగర్, మిర్యాలగూడ, నల్లగొండ, దేవరకొండ తాలూకాలు దాటి ఆమ్రాబాద్ అడవులకు వ్యాపించిన ఉద్యమానికి ఏరియాకమిటీ కార్యదర్శిగా నాయకత్వ పాత్ర నిర్వహించారు. కృష్ణానది ఇరుపక్కల వ్యాపించిన ఉద్యమ విప్లవకేంద్రమైన ‘నల్లమల రీజియన్' పార్టీ కమిటీలో బాధ్యతలు నిర్వహించారు. 1953-54లో నైజాం రజాకారు కాలంనాటి అక్రమ కేసులను కోర్టులో ఎదుర్కొని నిర్దోషిగా బయటపడ్డారు. 1957 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడుగా ఎన్నికయ్యారు. జిల్లాలో అగ్రశేణి నాయకులు దేవులపల్లి వెంకటేశ్వరరావు, భీమిరెడ్డి నర్సింహారెడ్డిగార్ల సహచరుడుగా పనిజేశారు. జిల్లా కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా రైతురంగం నాయకుడుగా, రాష్ట్ర కంట్రోల్ కమీషన్ సభ్యుడుగా పార్టీలో బాధ్యతలు నిర్వహించారు. 1962 నుంచి 1966 వరకు రాజమండ్రి, చంచల్గూడ, ముషీరాబాదు జైళ్ళలో డెటెన్యూగా 5 సంవత్సరాలు జైలు జీవితం గడిపారు. కామ్రేడ్ దొడ్డానర్సయ్య 1999 జనవరి 19న పరమపదించారు.

Browse more Telugu books