తెలంగాణ దర్శిని / Telangana Darshini
Koya Chandramohan and Tangirala Chakravarthy / కోయ చంద్రమోహన్ తంగిరాల చక్రవర్తి · Telangana Literature

Price: Rs. 135. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన వెనువెంటనే పలు సమాచార దర్శనులకు భిన్నంగా మొత్తం 31 జిల్లాల సమాచారంతో ఈ తెలంగాణ దర్శినిని డిసెంబరు 2016లో తొలుత వెలువరించాము. పాఠకుల విశేష ఆదరణతో ఇప్పటికి మూడు ముద్రణలు పొందింది. ఇది నాల్గవ ముద్రణ. ప్రధానంగా పోటీ పరీక్షల విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని తయారయిన ఇతర పుస్తకాలు ఇస్తున్న సమాచారంతో పాటు, ఉద్యోగులు, వ్యాపారులు, మేధావులు, పాత్రికేయులు - ఇలా అనేక వృత్తులలో ఉన్నవారి రోజువారీ అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని అదనపు సమాచారంతో పోటీ పరీక్షలకు, ప్రతి ఒక్కరి రోజువారీ అవసరాలకు, రెండు విధాలా ఉపయోగపడేలా తొలిప్రతినే తయారు చేశాము. దీనిలో ఆయా జిల్లాల అధికారులు, ప్రజాప్రతినిధుల ఫోన్ నెంబర్లు, ఇ మెయిల్ ఐడీలు ఇవ్వబడినాయి. రాష్ట్ర మంత్రుల ఫోన్ నెంబర్లు, ఇ మెయిల్ ఐడిలు ఇవ్వబడినాయి. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీల అడ్రసులు, ఫోన్ నెంబర్లు, ఆసుపత్రులు, విద్యాసంస్థల అడ్రసులు, నెంబర్లు మొదలైనవి కూడ ఇవ్వబడినాయి. హైదరాబాదులోని వివిధ మీడియా అడ్రసులు ఇవ్వబడినాయి. ఇప్పుడు ఈ తాజా ముద్రణ అన్ని విధాల సమగ్రతను సంతరించుకున్నది. ఇప్పటికే ఉన్న సమాచారాన్ని మరింత పరిపుష్టం చేశాము. తెలంగాణ రాజకీయ, సాంస్కృతిక రంగ ప్రముఖులు, క్రీడాకారులు మొదలైన ఎన్నో అదనపు అంశాలను జోడించాము. గత అన్ని ముద్రణల కన్నా మిన్నగా ఈ తాజా సమగ్ర ప్రతిని పాఠకులు ఆదరించి, సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాము.