తెలంగాణ తేజో మూర్తులు / TELANGANA THEJOMOORTHULU
ఇల్లిందల సరస్వతీదేవి / Illindala Saraswathidevi · History

Price: Rs. 65. మతాలు, జాతులు, భాషలు, కులాలు, వర్గాలు అనేకంగా ఉన్న దేశం మనది. ఒక భాషలోనే ప్రాంతానికొక రకమైన మాండలీకం ఉన్నది. భారతీయులందరి నాగరితా సంస్కృతులకు మూలం ఒకటే అయినా భావసమైక్యత జాతీయ సమైక్యత (Emotional and National Integration) లకు గట్టి పునాదులు లేకపోవటానికి పైన చెప్పబడినవే ప్రధాన కారణాలు, ఒక ప్రాంతాన్ని గురించి మరొక ప్రాంతీయులకు సరిగా తెలియక పోవటమూ, ప్రజలకు ప్రాంతీయాభిమానాలు రవంత అధికంగా ఉండటం కూడా పై వాటిలో చేరినవే. ఏకత్వంలో నుండి కలిగిన భిన్నత్వమే మనలో మనకు పొరుపులు పుట్టించి విడదీయటానికి ఇతరులకు అవకాశమిచ్చింది - ఇస్తున్నది. ఇతరులకు అవకాశము కలగకుండా వుండాలంటే మనమధ్య సౌభ్రాతృత్వము పెంపొందించాలి. విభేదాలకు ఆస్కారమైన పరిస్థితులలో కూడా రామలక్ష్మణ భరితశత్రుఘ్నల మధ్య పొరుపు పుట్టించడానికి ఎవరికీ సాధ్యము కాలేదన్న విషయము మనము మరువరానిది.