తెలంగాణ అసెంబ్లీలో అతివలు / TELANGANA ASEMBLY LO ATIVALU
డా॥ షేక్ హసీన / Dr. Sheikh Haseena · Politics

Price: Rs. 180. మలిదశ తెలంగాణ ఉద్యమానికి 14 ఏళ్ళు నిండిన సందర్భంగా 2012లో తెలంగాణా అంతటా కళాజాతాలు సాగాయి. రసమయి బాలకిషన్ సారధ్యంలో తెలంగాణాకు గ్రామాలలో సైతం ఉద్యమ గీతాలు పరవళ్ళు తొక్కాయి. ప్రముఖ వాగ్గేయకారుడు అందెశ్రీ 'జయజయహే' గీతం రచించారు. రసమయి 'ధూంధాం' కార్యక్రమం కోసం ఈ పాటను 2012 సెప్టెంబరు 30న పాడారు. తెలంగాణా రచయితల వేదిక సభల్లో ఇది పతాక గీతంగా మారింది. అప్పటి నుండి అనధికారికంగా తెలంగాణలోని ప్రతిబడిలోనూ ఉదయంపూట ఈ పాటను పాడుతున్నారు. ఈ పాట పూర్తి చేయడానికి ఏడేళ్ళు పట్టింది. పదివేల సంవత్సరాల చరిత్రని చెప్పే ప్రయత్నం చేశాను. ఇదొక చారిత్రక గీతమని వ్యక్తపరిచారు అందెశ్రీ. వీరు జనగామ జిల్లా, రేబర్తికి చెందినవారు. మాజి ముఖ్యమంత్రి కేసిఆర్ ఈ గీతానికి పలు సవరణలు చేశారు. పదకొండు చరణాలతో ఈ గీతం రాయగ అందులోని 4 చరణాలను రాష్ట్ర గీతంగా ప్రకటిస్తామన్నారు. 10 జిల్లాలు కాస్త 33 కావడంతో ఓ చరణంలో పది జిల్లాల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం అనే పదంలో 10 జిల్లాల బదులు పలుజిల్లాల అని మార్చి కొన్ని స్కూళ్ళల్లో పాడుతున్నారు. 2021లో ఇదే అంశాన్ని ఎమ్మెల్యే రఘనందన్ (బిజెపి) అసెంబ్లీలో లేవనెత్తారు. దానితో అప్పటి ముఖ్యమంత్రి ఈ పాటను ప్రభుత్వం రాష్ట్ర గీతంగా గుర్తించలేదన్నారు. అనంతరం ప్రభుత్వం మారడంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన జయజయహే తెలంగాణాను రాష్ట్ర గీతంగా ప్రకటించారు.