తెలంగాణా వైభవం మహిళా చైతన్యం / Telangana Vaibhavam Mahila Chaitanyam
Editor · Telangana Literature

Price: Rs. 283. “నా తెలంగాణ కోటి రతనాల వీణ" అన్నారు మహాకవి దాశరథి జీవ నదులై పొంగి పొర్లే కృష్ణమ్మ, గోదావరి, తుంగభద్ర, మంజీర నదీనదాలు, అగ్నిహోత్ర సన్నిభులైన పురోహితగణంతో, ఓంకార నాదాలతో వెలుగొందే వివిధ గుడి గోపురాలు, సస్యశ్యామల భరితమైన పచ్చని పంట పొలాలు, అంబరచుంబితమైన పర్వతాలు, కొండలు, గుట్టలు, బురుజులు, కోటలు నా తెలంగాణకు 1 అలంకారప్రాయాలు. తెలంగాణ లోని ప్రతి చెట్టు, పుట్ట, గుట్టు దాయి, రప్ప దేన్ని కదిలించినా అపూర్వమైన అనుభవాలు వెల్లివిరుస్తాయి, అందమైన సంగీత స్వరాలు వినిపిస్తాయి. కొన్ని పురాతన కట్టడాలు, ద గోపురాలు, తీర్థయాత్రల ప్రాధాన్య దేవాలయాలు, నాడు నేడు మన సంస్కృతికి ఆనవాళ్లుగా నిలిచి మౌనముద్రలో మనకు ఎన్నో విషయాలను, మనోరంజకమైన సాధనాసామాగ్రిని, తరతరాల మన రాష్ట్ర సాంస్కృతిక వస్తు విశేష సంపత్తిని అందిస్తాయి. "ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని" అంటూ పెయినిండిన దేశభక్తితో రాయప్రోలు సుబ్బారావు గారు వాకృచ్చారు. అంతే కాకుండా ఏపూర్వ పుణ్యమో ఏ యోగ ఐలమో జనియించినాడ నీ భరతఖండ మున" అంటూ అమూల్యమైన భాష, భావ సంపదను మనకందించారు. "ఆకులం దన అణగి మణగి 'కవిత కోయిల' పలుక వలెనోయ్, ఆ పలుకులను విని దేశమందభిమానములు మొలకెత్త వలెనోయ్" అంటూ తమ అభిప్రాయాన్ని సూచనప్రాయంగా తెలిపి సమాజ శ్రేయస్సుకై ఒక సందేశాత్మక నినాదాన్ని మనకందించారు. సులుభమైన, సుకరమైన, ఆచరణ సాధ్యమైన, ఆమోదయోగ్య మైన, అభిలాషనీయమైన, వారి సందేశం మానవజాతికి ఆదర్శంగా, అనుభవైక వేద్యంగా పరిగణించవచ్చు.