తెలంగాణలో భూ చట్టాల పరిణామ క్రమం ధరణి - భూ భారతి చట్టాలు / Evolution of Land Laws in Telangana Dharani - Bhu Bharati Acts

కె. పార్థసారథి / K. Parthasarathi · Telangana Literature

తెలంగాణలో భూ చట్టాల పరిణామ క్రమం ధరణి - భూ భారతి చట్టాలు / Evolution of Land Laws in Telangana Dharani - Bhu Bharati Acts book cover

Price: Rs. 45. తెలంగాణలోని నైజాం ప్రాంతంలో 1907కు ముందు ఎలాంటి భూ చట్టాలు లేవు. చాలా కాలంపాటు భూ కామాంధులు ఎట్టి హక్కులు లేకుండా ఉన్నారు. 1907కు ముందు నైజాం ప్రభుత్వం భూమి పన్ను వసూలుదారులను నియమించింది. వీరు ప్రభువు భూమికి సర్వాధికారులుగా ఉండేవారు. శిస్తు వసూలు హక్కును ప్రభుత్వం ప్రతి సంవత్సరం గాని, లేక కొన్ని సంవత్సరాలకు ఒకసారి గాని వేలం వేసి కొంత మందికి ప్రత్యేకించి కేటాయించడం జరుగుతుండేది. పన్ను వసూలుదారులు రైతుల నుండి వసూలు చేయవల్సిన మొత్తాన్ని నిర్ణయించేందుకు డిప్యూటీలను, సబ్ డిప్యూటీలను నియమించేవారు. వీరు ఒక పరగణాను (8-10 గ్రామాల కూటమి) రైతులు చెల్లించాల్సిన శిస్తుల మొత్తాన్ని నిర్ణయించేవారు. ఆ మొత్తాన్ని బట్టి ప్రతి గ్రామం ఎంతెంత శిస్తు చెల్లించాలో నిర్ణయించేవారు. ఆ మొత్తాన్ని గ్రామపటేల్, పట్వారీలు మరియు సాగుదారులపై వ్యక్తిగతంగా విభజించేవారు. ఈ విభజన గ్రామ సంపన్నుడైన పటేలు, పట్వారీల ఇష్ట ప్రకారంగా జరిగేది. పలుకుబడి గలవాళ్లకు తక్కువ శిస్తు, నోరులేని పేదలకు ఎక్కువ భారం వేసేవారు. జాగీర్దారులు, ఇనాందారులు, మక్తదారులు, భూస్వాముల ఆధీనంలో ఉన్న భూమికి తక్కువ శిస్తు ఉండేది. భూములు కౌలుకు తీసుకున్న ఇజారాదారులు, బంజరుదారులు, మక్తదారులు కూడా ఎలాంటి భూహక్కులు లేకుండా ఉన్నారు.

Browse more Telugu books