తెగ మురిసే మేక / TEGA MURISE MEKA

M. Vishnu Prasad / ఎం. విష్ణుప్రసాద్ · Stories & Poetry

తెగ మురిసే మేక / TEGA MURISE MEKA book cover

Price: Rs. 80. కవిది పూర్వ కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా). బాల్యమంతా స్వగ్రామంలో సాగింది. పదవ తరగతి వరకూ ఎల్లారెడ్డిపేటలో, ఇంటర్ పక్కనే ఉన్న బొప్పాపూర్ గ్రామంలో జరిగింది. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదవడం జరిగింది. పుట్టిన ప్రాంతం కారణంగా కవిపై వామపక్ష భావజాలం ప్రభావం ఉండేది. ఎస్ఎఫ్లో చేరిక సైద్దాంతిక బీజం వేసింది. సిద్ధిపేట డిగ్రీ కాలేజీ కేంద్రంగా ఎస్ఎఫ్ఎలో పని చేయడం జరిగింది. 2003 సంవత్సరంలో జర్నలిజంలోకి అడుగుపెట్టాడు. అప్పటికి డిగ్రీ ద్వితీయ సంవత్సరం మాత్రమే పూర్తైంది. ప్రజాశక్తిలో కంప్యూటర్ ఆపరేటర్, రిపోర్టర్గా సిద్దిపేట నుండే జీవితం ప్రారంభించాడు. ప్రజాశక్తి జర్నలిజం స్కూల్లో శిక్షణ తరువాత కరీంనగర్ లో సబ్ ఎడిటర్గా చేరాడు. సంగారెడ్డికి సబ్ ఎడిటర్గా బదిలీపై వచ్చాడు. ఉమ్మడి మెదక్ డెస్క్ ఇన్ఛార్జిగానూ పని చేశాడు. 2007 సంవత్సరం నుండి ప్రస్తుతం వరకు టివి5లో ఉమ్మడి మెదక్ జిల్లాలో సీనియర్ కరస్పాండెంట్గా పని చేస్తున్నాడు. జర్నలిజంలో 22 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. జర్నలిస్టుగా ఉండడం వల్ల ప్రజల కష్టాలు స్వయంగా చూడడం జరిగింది. ఆకలిచావులు, రైతు ఆత్మహత్యలు, వలసలపై అనేక వార్తలు ఇవ్వడం జరిగింది. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల్లో స్థోమత లేక అక్క భర్తకే చెల్లెలును ఇచ్చి పెళ్లి చేయడం సర్వసాధారణంగా మారిన విషయాన్ని, ఎల్కంటి గ్రామంలో ఐదేళ్ల వ్యవధిలో ఏకంగా నలబై ఐదు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న విషాదాన్ని వెలుగులోకి తెచ్చాడు. ఆ తరువాత గ్రామాన్ని స్వచ్ఛంద సంస్థలు, పలు పార్టీలు సందర్శించి రైతు కుటుంబాలకు సాయం అందించడం జరిగింది. మల్లన్నసాగర్ నిర్వాసితుల బాధలు రిపోర్టు చేశాడు. బాల కార్మికులపై చేసిన స్ట్రింగ్ ఆపరేషన్ బహుశా దేశంలోనే పెద్దది. కంపెనీలో పని చేస్తున్న బాల కార్మికులను 267 మందిని రెస్క్యూ చేసి కాపాడడం జరిగింది. వీరంతా కూడా అమ్మాయిలే. ఇలాంటివి ఇరవై రెండేళ్ల జీవితంలో చాలానే ఉన్నాయి. అవన్నీ ఇక్కడ పేర్కొనడం సాధ్యం కాదు. సమాజంలో జరుగుతున్న పరిణామాలన

Browse more Telugu books