తిలక్ కథలు / THILAK KATHALU

దేవరకొండ బాలగంగాధర్ తిలక్ / Devarakonda Balagangadhara Thilak · Books

తిలక్ కథలు / THILAK KATHALU book cover

Price: Rs. 320. మధ్యతరగతి మందహాసాలు, కింది తరగతి చిందులాస్యాలూ, ఉన్నత వర్గాల ఉన్నత్త విలాసాలూ వెరసి సమాజంలో కొడిగట్టిపోతున్న మానవత్వం, దీపం చుట్టూ మోగుతున్న ఆశా, పేరాశా, దురాశా, స్వార్థం, మోసం, క్రౌర్యాల మరణమృదంగ ధ్వానాలను తన కథల ద్వారా వినిపించిన విశిష్ట కథకుడు తిలక్. కథా వస్తుసేకరణలో గోర్కీ చూపూ, కథా నిర్వహణలో మొపాసా నేర్పూ, వెన్నెముకలాంటి తాత్వికతా విస్తరణలో రసెల్ కూర్పు వల్ల తిలక్ కథలు జనం నుండి ఉద్భవించి జనం బలహీనతలపై సెర్చిలైట్ వేస్తాయి. "... ప్రతి జీవితం ప్రత్యేక జీవితం, ఒకరికీ మరొకరికీ సంబంధం లేదు"... అని ఓ కథలో తిలక్ అన్నట్లు తన కథలోని పాత్రలన్నీ అనేకానేక సామాజిక సమస్యల వలయాల్లో తమతమ వ్యక్తిత్వాలను సందర్భానుసారంగా ప్రకటిస్తూ, మానవత్వం భిన్నకోణాలను ప్రదర్శిస్తాయి. ఇలా ఉండడం చూసి ఎలా ప్రవర్తించి ఉంటే సమాజం ఉన్నత పథాలవైపు వెళుతుందో ఆలోచించుకోమన్న సూచన పాఠకులకందిస్తాడు. తిలక్. సమాజం ఎలా నడుస్తోందో, మానవత్వం ఎలా ఎన్ని విధాలుగా పతనమవుతోండో రూపుకట్టిస్తాడు. కారణాల వెతుకులాట శ్రమ పడాల్సింది పాఠకులే, తన కథలు ఏదో ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాలన్న భావం తిలక్ కు ఉన్నట్టు కనిపించదు. తన సమకాలిక యువ రచయితల మాదిరిగా సవిమర్శక వాస్తవికతా దృష్టి ఉన్న అభ్యుదయ రచయిత, సాంప్రదాయనీతికీ, మతానికీ ఇచ్చిన ప్రధాన్యం, మానవత్వానికి ఇవ్వని సమాజాన్ని చూసి కలత చెందడం తిలక్ రచనల్లో చూడగలం. "ఎవర్నీ నమ్మకు ఈ మనుషులందరూ దొంగ వెధవలు విష సర్పాలన్నది" తిలక్ సగటు పాత్రల అభిప్రాయం. “స్వార్థం కన్నా గొప్ప శక్తి ప్రపంచంలో లేదని తెలిసిపోయింది నాకు. ఈ ఆదర్శాలు, ఆశయాలు అన్నీ ఆ ప్రాథమిక స్వార్థానికి అంతరాయం కల్గించనంతవరకే" అన్నదీ, “సముద్రం లాంటిడే దరిద్రం కూడా అవతలి ఒడ్డు కనబడదు" అన్నదీ, దాన్ని అంటిపెట్టుకొని అవరించే ఆకలిని గురించి "రోగిష్టి ఆరోగ్యాన్ని గురించీ, ఆకలితో ఉన్నవాడు రుచికరమైన పిండివంటల గురించి ఆలోచించకుండా ఏ చట్టమూ శాసించలేదు" అన్నదీ తిలక్ దుర్భిణీ చూపుతో పసిగట్టిన సామాజికాంశాలు. తిలక్ స్త్రీ పాత్రల్లో తెలివిమీరినతన

Browse more Telugu books