జ్ఞాపకశక్తికి మార్గాలు/GNAPAKASHAKTHIKI MAARGALU

జి.వెంకటేశ్వర్లు / G. Venkateshwarlu · Education & Science

జ్ఞాపకశక్తికి మార్గాలు/GNAPAKASHAKTHIKI MAARGALU book cover

Price: Rs. 45. ఒక జనరల్ స్టోర్స్లో సేల్స్ గర్ల్ పనిచేస్తున్న ఒక అమ్మాయి ఒక వారం రోజులపాటు స్టోర్లోని మూల మూలలకీ, ప్రతి అంతస్తుకీ వెళ్లి ప్రతీ విభాగంలో ప్రతీ అరను, ప్రతీ వస్తువును పరిశీలించి మనోఫలకంపై ముద్రించుకుంది. ఇలా ముద్రించుకున్నది మరిచిపోకుండా మనో నేత్రం ద్వారా చాలాసార్లు సినిమాలా వేసి చూసుకుంది. అలా చూసుకొంటూ అన్నీ జ్ఞాపకానికి తెచ్చుకుంది. ఇలా ఒక వారం రోజులు చేసింది. చూసింది జీర్ణించుకొంది. జీర్ణించుకొన్న దానిని మర్చిపోకుండా మస్తిష్కంలో భద్రపరచుకొంది. మీకు ఆసక్తిలేని విషయాలనైనా ఉద్యోగ నిర్వహణలో తప్పని సరిగా గుర్తుంచుకోవలసిన విషయాలనైనా పైన చెప్పినట్లు ముద్రద్వారా గుర్తుంచుకోవచ్చును. అన్ని పాఠ్యాంశాలు ఆసక్తికరంగా వుండవు. ఇంగ్లీషు, ఆర్థిక శాస్త్రం, లెక్కలు, సైన్సునో వీటిమీద చాలా మందికి ఆసక్తి వుండదు. అటువంటప్పుడు ఈ సబ్జెక్టులను ముద్రసూత్రాన్ని ఆన్వయించి చదివితే బాగా జ్ఞాపకముంటాయి. ఏ సబ్జెక్టులపై ఆసక్తీ, ఆకర్షణ వుంటాయో అవి ఎలాగూ బాగా జ్ఞాపకముంటాయి. జ్ఞాపకశక్తికి ఆసక్తి, ఆకర్షణ పునాదిరాళ్ళు, అందుచేత ఆసక్తిలేని సబ్జెక్టులపై కూడ ఆసక్తి పెంచుకోవటానికి ప్రయత్నించాలి.

Browse more Telugu books