జిగిరి / JIGIRI

పెద్దింటి అశోక్కుమార్ / Peddinti Ashok Kumar · Novels

జిగిరి / JIGIRI book cover

Price: Rs. 95. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం భీముని మల్లారెడ్డిపేట గ్రామంలో జన్మించారు. స్వంత ఊరిలో ప్రాథమిక విద్య, లింగన్నపేటలో హైస్కూల్ విద్యను పూర్తిచేసి గంభీరావుపేటలో ఇంటర్, సిద్దిపేటలో డిగ్రీ, కాకతీయ యునివర్సిటిలో ఎం.ఏ. తెలుగు, శ్రీకృష్ణదేవరాయ యునివర్సిటీలో ఎం.ఎస్సీ (గణితం), ఉస్మానియాలో బి.ఎడ్. పూర్తి చేసారు. 1999 నుండి కథలు రాయడం మొదలు పెట్టారు. ఇంతవరకు 200 కథలు, ఆరు నవలలు, 35 వ్యాసాలు, 4 నాటికలు, 4 నాటకాలు రాసారు. 7 కథా సంకలనాలు, 3 నవలలను వెలువరించారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కథలు, వ్యాసాలతో 'పోరుగడ్డ' పుస్తకాన్ని వెలువరిస్తూ మిలియన్ మార్చ్ నేపథ్యంలో 'లాంగ్ మార్చ్' నవలను రాసారు. పలు కథలు ఇతర భాషల్లోకి అనువాదం అయ్యాయి. 11 కథలతో హిందీలో 'ఓ ఆక్రమన్ కబ్ కా హెూచుకా' పేరుతో 11 కథలతో మరాఠీలో 'ఓ ఘర్ బంద్ డాలియా' పేరుతో సంకలనాలు వచ్చాయి. పాఠశాలనే ప్రయోగశాలగా, పేదల బతుకులే కథా వస్తువులుగా రచనలు చేస్తున్న అశోక్ కుమార్ ప్రస్తుతం ఇల్లంతకుంట మండలం రామోజిపేట పాఠశాలలో గణిత ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు.

Browse more Telugu books