చీకటి పాట / Cheekati Paata
N .VENU GOPAL , C.VANAJA / వేణుగోపాల్ , సి.వనజ · Novels

Price: Rs. 108. విస్తారమైన ప్రజా మద్దతుతో ఎన్నికైన ప్రగతిశీల అధ్యక్షుడి ప్రభుత్వం మీద సైనిక కుట్ర జరిగి, అధ్యక్షుడిని కాల్చిచంపారు. ప్రగతిశీల ఆలోచనలున్న వారందరినీ ఫుట్ బాల్ స్టేడియంలో పోగేసి వేలాది మందిని ఊచకోత కోశారు. దేశవ్యాప్తంగా చీకటిపాలన నెలకొల్పారు. వేలాది మంది ప్రవాసం పోగా, సైనిక పాలకులు దేశంలోకి ఎన్నడూ తిరిగిరావడానికి వీలులేని నిషిద్ధ వ్యక్తుల జాబితా తయారు చేశారు. ఆ జాబితాలో ఒక వ్యక్తి సైనిక కుట్రకు ముందు జాతీయ చిత్ర నిర్మాణ సంస్థ అధినేత. ప్రపంచ ప్రసిద్ధి పొందిన చిత్ర నిర్మాత. ఎట్లాగైనా సరే దేశంలో ప్రవేశించి ఆ సైనిక నియంత కింద సాగుతున్న చీకటి పాలనను చిత్రించి లోకానికి తెలియజెప్పాలని అతని కల. పన్నెండు సంవత్సరాల ప్రవాసం తర్వాత, మారు వేషంలో దేశంలో ప్రవేశించాడు. దేశంలోని ప్రతిఘటనోద్యమ సహాయంతో ఆరు వారాల పాటు దేశమంతా తిరిగి, అడుగడుగునా ప్రాణాంతక ప్రమాదాలను ఎదుర్కొంటూ లక్ష అడుగుల ఫిల్మ్ చిత్రీకరించాడు. ఆ సాహసి అసాధారణ ధైర్య సాహసాల రోమాంచక గాథ ఇది. ఆ వ్యక్తి సాహసమే అపూర్వమైనదంటే అంతకన్న అపూర్వంగా, ప్రపంచమంతా అబ్బురపడిన అపురూప సృజనకర్త ఆ సాహసగాథను విని దాన్ని తన అద్భుత అక్షరాల్లో అలంకరించిన కాల్పనిక వాస్తవిక రచన ఇది.