చిరు మొలకలు / Chiru Molakalu
Akella Venkata Subbalakshmi. / ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి · Children's Books

Price: Rs. 162. సాంఘిక కధలు, బాలల కధలు అలవోకగా రాయగలిగే రచయిత్రి శ్రీమతి ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి! సమాజ పరంగా ఆలోచించే వారే పదునైన సాంఘిక కథలు రాయగలరు. మన చుట్టూ ఉన్న సమాజాన్ని పరిశీలిస్తే గాని కథకులకు కథా వస్తువు దొరకదు. అలా ఆలోచనలకు అలవాటు పడ్డ ఆకెళ్ళ గారు బాలల లోకం గురించి ఆలోచన మొదలు పెట్టాక బాల సాహిత్యాన్ని విరివిగా రాయడం ఆరంభించారు. అందులో కృత్యు కృత్యులయ్యారు. దానికి నిదర్శనం 'మొలకలు' బాలల కథా సంపుటి! ఈ సంపుటిలో మొత్తం 21 కథలున్నాయి. మొదటి కథ 'మొలకలు' ప్రకృతి వ్యవసాయంలో చెప్పుకునే 'మన పంట-మన వంట' అనే నినాదానికి అతుక్కుపోయే కథ యిది! పెరటితోట పెంచడం వల్ల కుటుంబానికి 'కూరల ధీమా చేకూరుతుంది. పొదువు, ఆరోగ్యం కూడా కుటుంబానికి దక్కుతాయి. హఠాత్తుగా అవసరం కలిగినప్పుడు వెంటనే వంటింటికి అందిపోతాయి. 'బాల' అనే అమ్మాయి విత్తనాలు నాటకుండా ఇంట్లో వాడే ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, చామ దుంపలు, ఒలిచి పడేసిన గోంగూర మొక్కల కాడలు పెరడులో పాతి చక్కని ఫలసాయం సాధించడమే ఈ కథలోని ఇతివృత్తం. ఈ కథ చదివిన వారిలో మొలకలను పాతి పంట పండించవలచ్చన్న ఆలోచన తప్పనిసరగా వస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.