చిత్రకళ నూతన ధోరణులు / Chitrakala Nutana Dhoranulu
టి.వి. ప్రసాద్ / T.V. Prasad · Literature

Price: Rs. 180. 'రెనాయిర్ (రెన్వా) డాన్సర్ల శిల్పం' ఫొటో. డోరిట్ లెవిన్ స్టెయిన్ (Dorit Levinstein) పెయింటరు, శిల్పి. పెయింట్ చేసిన బ్రాంజి, అల్యూమినియమ్లో సృజించిన శిల్పాలకు ప్రసిద్ధి గాంచింది. డోరిట్ చిత్రాలు, శిల్పాలు అన్ని దేశాలలో ప్రదర్శింపబడ్డాయి. చిత్ర, శిల్ప కళలను మేళవించి అనేక ప్రయోగాలు చేసింది. మైఖేల్ జాక్సన్ క్వీన్ ఎలిజబత్, బుద్ధ వంటి ప్రముఖుల శిల్పాలను సృష్టించింది. డోరిట్ అమెరికాలో 1956లో జన్మించింది. టెక్నాలజీ స్కూల్ (Technion) నుండి గ్రాఫిక్ డిజైనింగ్లో డిగ్రీని అందుకుంది. 1985-88ల మధ్య ఏవ్ని (Avni) ఇన్స్టిట్యూట్లో పెయింటింగు శిల్ప కళను బోధించింది. డోరిట్లెనిన్స్టెయిన్ పై సెయిజాన్. గుస్టావ్ క్లిప్ట్ మొదలైన ఆర్టిస్టుల ప్రభావం కన్పిస్తుంది. 1889 నుండి నూతన కళలో ప్రయోగాలు చేపట్టి, శిల్పకళను పెయింటింగుతో మేళవించి అసాధారణమైన శైలిని అభివృద్ధి చేసింది. ఫలితంగా దారు, అల్యూమినమ్ శిల్పాలను, క్రమంగా తనదైన నూతన శైలిలో బ్రాంజి శిల్పాలను సృష్టించింది. స్కెచ్లు వేయకుండా నేరుగా శిల్పాలు డాన్స్ చేస్తున్న ఆకారాలుగా మలపడంలో విజయం సాధించింది. డోరిట్ సృష్టించిన వందలాది శిల్పాల్లో ప్రముఖ వ్యక్తులవి, చిత్రకారులవి, జంతవులవి, నక్షత్ర రాశులవి (Zodiac) వున్నాయి.