గోపి, గోపిక, గోమతి / GOPI , GOPIKA , GOMATHI

డి. సుందరరావు / D.SUNDARA ROA · Novels

గోపి, గోపిక, గోమతి / GOPI , GOPIKA , GOMATHI book cover

Price: Rs. 180. దేశం కోసం, ఉత్తమ సమాజం కోసం ప్రాకులాడిన ముగ్గురు ధన్యమూర్తుల జీవిత చిత్రం సుందరరావుగారి ఈ "గోపి, గోపిక, గోమతి" నవల. వృత్తి విద్యల ప్రాధాన్యతను, సమాజం అందులో అంతర్భాగమైన ప్రభుత్వం తలనెత్తుకున్న ఈ వర్తమాన సమాజ ఆవిష్కరణ చిత్రాన్ని ఈ నవల్లో గోపి పాత్రకు అనుసంధానం చేసి, రచయిత ప్రభుత్వోద్యోగి అన్న పదానికి పూర్ణత అందించారు. ప్రధానంగా, ఈ నవల వాస్తవాంశాలకు అద్దంపట్టింది. సమాజం, దాని పరిరక్షణ, ఆ సమాజంలో నివసించే ప్రతి ఒక్కరిది అన్న ప్రాథమిక సూత్రానికి బలం చేకూర్చింది. నవల రచనలో కథ ట్రీట్మెంట్లో రచయిత ఎక్కువ శ్రద్ధ కనబర్చారు. నవల్లో వేగం ఉంది. స్వచ్ఛమైన జీవితాల సదాశయాల సమ్మిశ్రణం వుంది. ఇప్పటి వరకూ సుందరరావుగారు వ్రాసిన నవలలన్నీ ఒక ఎత్తు. ఈ నవల మాత్రం ఎంచుకున్న ఇతివృత్తం మంచి అభినివేశంతో అలరారింది. రచయిత ఈ నవలను తగిన మోతాదుతో ఆద్యంతం మలిచి, ఒక కొత్తదనానికి ప్రాణ ప్రతిష్ఠ చేశారు.

Browse more Telugu books