గుణాఢ్యుని బేతాళ కథలు / Gunadhyuni Bethala Kathalu

సహవాసి / Sahavaasi · Books

గుణాఢ్యుని బేతాళ కథలు / Gunadhyuni Bethala Kathalu book cover

Price: Rs. 95. ఇది బేతాళ పంచ వింశతి. అంటే ఇరవై ఐదు బేతాళ కథలు. వీటిని గుణాఢ్యుడు రచించాడంటారు. వందల ఏళ్లు గడిచినా ఈ కథల గుబాళింపు తగ్గనే లేదు. ఇవి మూల కథలు. ఆనాటి ఈ టెక్నిక్ ఇప్పటికీ ఆధునికమే. ఈ మూసలోనే ఎన్నో కొత్త కథల్ని సృష్టించి చందమామ తన పిల్ల పాఠకుల మనసులను ఏళ్ల తరబడి రంజింపచేసింది. ఎందరో రచయితలు రాజకీయ బేతాళ కథల పేర తమ వ్యంగ్య బాణాలను సంధించారు. ' ఈ మూల కథలు పిల్లల కోసం కాదు. వాటిని ఇప్పుడు సహవాసి తేట తెలుగులో అందించారు. ఇది సహవాసి చిట్ట చివరి అనువాదం. గుణాఢ్యుని కాలానికీ ఇప్పటికీ సామాజిక నేపథ్యం ఎంతో మారిపోయింది. అయినా ఇన్ని శతాబ్దాల తర్వాత కూడా ఈ కథలకున్న పటుత్వం సడలలేదు. మన వివేచనకి అవి పదును పెట్టడం మానలేదు. మన తార్కిక శక్తిని పరీక్షించడం ఆపలేదు. కాల పరీక్షకు తట్టుకొని నిలబడడం అంటే అదేగదా!

Browse more Telugu books