గుడ్ టచ్ - బ్యాడ్ టచ్ / GOOD TOUCH - BAD TOUCH

నాటూరి విజయ్ రెడ్డి / Naturi Vijay Reddy · Children's Books

గుడ్ టచ్ - బ్యాడ్ టచ్ / GOOD TOUCH - BAD TOUCH book cover

Price: Rs. 75. మీరు మీ పిల్లలకు ఇప్పటి వరకు ఇచ్చిన బహుమతులలో అత్యంత గొప్పది ఏమిటో తెలుసా...? వాళ్ళకు మీరిచ్చిన ఈ జస్మ! అంతకు మించిన గొప్ప బహుమతి ఇంకేం ఉంటుంది చెప్పండి? ఇదిగో... ఇక్కడే వుంది ఇంకో అద్భుతమైన బహుమతి....!!! అదే.. ఈ పుస్తకం...!!! ఈ పుస్తకమును కొని మీ పిల్లలకు బహుమతిగా ఇవ్వగలిగితే వాళ్ళకు గొప్ప భవిష్యత్ను ఇచ్చినవారు అవుతారు. ఎందుకంటే!!! ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. తాతయ్యలు, నానమ్మలు, అమ్మమ్మలు, బాబాయి, పెదనాన్నలు మన పిల్లలకు కనిపెట్టుకుని ఉండేవారు. వీళ్ళను దాటుకుని ఎవరూ పిల్లలను టచ్ చేసే అవకాశం ఉండేది కాదు. ఇప్పడు ఉమ్మడి కుటుంబాలు లేవు. బ్రతుకు పోరాటంలో ఎవరి బిజీలో వాళ్ళు ఉంటున్నారు. అయితే పిల్లలకు వెన్నంటి ఉండి వాళ్ళను కపాడే బాధ్యత ఎవరిది? ఖచ్చితంగా పిల్లలదే! ఉదయం లేస్తే న్యూస్ పేపర్లో / టీవీల్లో ఎన్నో దారుణాలు చూస్తూ ఉన్నాం. ఆ దారుణాలు మన పిల్లలకు జరగకూడదంటే మనం చేయగలిగిన ఒకే ఒక మంచి పని ఈ పుస్తకాన్ని వారికి అందించడం. ఈ పుస్తకాన్ని మనం చదివి ఇందులోని విషయాలను మన పిల్లలకు వివరించి చెప్పాలి. చదివే వయస్సున్న పిల్లలచేత ఈ పుస్తకాన్ని చదివించాలి. తద్వారా వాళ్ళను వాళ్ళే కాపాడుకునే జ్ఞానాన్ని పొందుతారు. వాళ్ళకు ఇంకో మనిషి అవసరం ఉండదు. వాళ్ళ భవిష్యత్ సువర్ణం అవుతుంది. తెలుగులో ఈ సబ్జెక్ట్ మీద వచ్చిన మొట్టమొదటి పుస్తకం ఇది. - విజయ్ రెడ్డి

Browse more Telugu books