గీతాంజలి / Gitanjali

chalam / చలం · Novels

గీతాంజలి / Gitanjali book cover

Price: Rs. 135. "తెలుగు సాహిత్యంలో ఎవరికీ లేని ప్రత్యేకత చలంగారిది. తనను తాను అన్వేషించుకుంటూ ఒక వ్యక్తి ఎంతదూరం ప్రయాణించగలడో అంత దూరం ప్రయాణం చేసిన వ్యక్తి చలం. మొహమాటం లేకుండా, లోకనిందకు జంకకుండా తన ప్రయాణాన్నంతా రచనల్లో కూర్చిన వ్యక్తి.” చలం 1894 మే 19న జన్మించిన చలం నవలలు, కథలు, కవితా రచనలు, రూపకాలు, ఏకాంకికలు, అనువాద రచనలు మిక్కిలిగా చేశారు. ఇంకా వ్యాసాలు, లేఖలు, పీఠికలు, వేలకొలది ఉత్తరాలు వెలువ రించారు. చలం జీవితం, సాహిత్యం మీద అనేక వ్యాసాలు, పుస్తకాలు వచ్చాయి. 1979 మే 4న కనుమూశారు. ఈశ్వరుని అస్థిత్వం మీద సందేహం కలిగి - 'లేడా! లేడేమో!' అనుకున్న రోజులలో గూడ, గీతాంజలి ఏకాంత పారాయణ గ్రంథం చలానికి, కనీసం మూడు దశాబ్దాల పారాయణ ఫలితం ఈ అనువాదం. 1958లో అనువాదం అయింది. సుదీర్ఘమయిన విలువయిన పీఠిక గూడ వ్రాశారు. రవీంద్రుని కవితా రచనలు ఇంకా అనువదించారు. “గీతాంజలి”ని అనువదించటానికి భాషా పాండితి మాత్రమే చాలదు, పరిణతి మాత్రమే సరిపోదు; అందుకు అంతర్వీక్షణ అవసరం, జీవన సాధన అవసరం. ఈ తెలుగు "గీతాంజలి"ని చదివితే అంతర్వీక్షణా, జీవనసాధనా వున్న వారే అనువదించినట్లు గోచరిస్తుంది. చలంగారి “గీతాంజలి”కి ఇదొక ప్రత్యేకత.

Browse more Telugu books