గాంధీని గాడ్సే ఎందుకు చంపాడు? / why Godse Killed Gandhi?
ఎ.ఎన్. నాగేశ్వరరావు · New Arrivals

Price: Rs. 145. రచయిత పరిచయం వి.టి. రాజశేఖర్ శెట్టి అని పిలువబడే వి.టి. రాజశేఖర్ 'దళిత్ వాయిస్' వ్యవస్థాపకుడు. సంపాదకుడు (1932-2024). దళిత హక్కుల కోసం జీవితాంతం వరకు పోరాడిన 'విటిఆర్' దళితుడు కాదు. ఇరవైకి పైగా ఆంగ్ల పుస్తకాల రచయిత. ఆయన రచనలు అనేక భాషలలో అనువదించబడ్డాయి. దేశంలోని అరుదైన ORIGINAL THINKERS లో ఒకరిగా పరిగణించబడే 'విటిఆర్' ఇరవై ఏళ్లు హిందూ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లలో పనిచేశారు. మార్క్సిజం ఆవశ్యకతను, భారతదేశంలోని దళితుల హక్కులకు డా॥ అంబేడ్కర్ తాత్వికతను కలిపే ప్రయత్నం చేశారు. 2005లో లండన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సౌత్ ఏషియా (LISA) ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్నారు. తన స్వస్థలం మంగుళూరులో 20 నవంబరు 2024 న మరణించారు. ఆయన ప్రఖ్యాత రచనలు : BRAHMANISM, CASTE-A-NATION WITHIN THE NATION, WHY GODSE KILLED GANDHI, BRAHMANISM-A-COUNTER REVOLUTION, DALITS-BLACK UNTOUCHABLES OF INDIA Etc. అనువాదకుడి పరిచయం ఎ.ఎన్. నాగేశ్వరరావు కావలి జవహర్ భారతి తిరుపతి ఎస్వీ యూనివర్శిటీలో చదివారు. విద్యార్థి దశలోనే హేతువాద, విప్లవ సాహిత్య ఉద్యమాలలో పాల్గొన్నారు. జనసాహితి స్థాపక సభ్యుడు. మార్క్సిస్టు-లెనినిస్టు ధోరణిలో సుదీర్ఘకాలం రచనలు చేశారు. 'కదలిక' సంపాదకవర్గ సభ్యుడిగా పదేళ్లు, బహుజనవాద పత్రిక 'సమాంతర' సంపాదకవర్గ సభ్యుడిగా పనిచేశారు. సాహిత్యం, విమర్శ. సామాజిక, రాజకీయార్థిక రచనలు. అనువాదాలు కొనసాగిస్తున్నారు. ప్రచురించిన పుస్తకాలు: 'సముద్రం నాస్వప్నం (కవిత్వం), భీమా కోరేగాం- మహర్ ఉద్యమ చరిత్ర, అనువాదాలు: సజీవ దహనం, పెరియార్ యథార్ధ రామాయణం. సాకేత్ - అయోధ్య, అంబేడ్కరిజం అంటే ఏమిటి? తిరుపతి బౌద్ధ క్షేత్రం, కులం-అధ్యయనం, అంబేడ్కర్-దళిత భవిష్యత్తు, విటిఆర్ పుస్తకాలు బ్రాహ్మణవాదం & తదితరాలు.