గణిక / Ganika

Vijaya Bhandaru / విజయ భండారు · Stories & Poetry

గణిక / Ganika book cover

Price: Rs. 135. భండారు విజయ కథలు ప్రస్తుత సామాజిక అవసరాన్ని తీరుస్తున్నాయి. జటిలమైన సమస్యలనూ, పురుషాహంకారాన్ని ఈ కథలలోని పాత్రలు ఎలా ఎదుర్కొన్నాయో అత్యంత సహజంగా చిత్రించారు. సమకాలీన సమాజంలోని స్త్రీల సమస్యలను - ముఖ్యంగా దిగువ మధ్యతరగతి స్త్రీల జీవితాలను నిశితంగా పరిశీలించి సమస్య పరిష్కార దిశగా కథనం సాగించి సమాజానికి దిశానిర్దేశం చేయటంలో ఆమె కృతకృత్యులయ్యారు. పురుషస్వామ్యానికీ లైంగికదాడులకూ గురైనవారు తమ జీవితాలను నేర్పుతో సరిదిద్దుకోవటాన్ని చాలా కథలలో చూడవచ్చు. - డా. విజయభారతి విజయ కథలలో వస్తువే ప్రధానం. వస్తు వైవిధ్యం చాలా ఉంది. స్త్రీల జీవితమే అన్ని కథలలో వస్తువైనా ప్రతి కథా ఒక విలక్షణమైన పార్శ్వాన్ని, ఎక్కువ మందికి తెలియని పార్శ్వాన్ని చూపేందుకు ప్రయత్నించింది. ఈ కథలలో విపరీతంగా కదిలించేవి, కన్నీళ్ళు తెప్పించేవి రెండు మూడున్నాయి. 'నైటీ', 'మంచినీళ్ళు', 'బచ్చాపౌచ్'. ఈ కథలు చదువుతుంటే గుండె పట్టేస్తుంది. బాధిత స్త్రీలకు హింస మామూలై, ఆ హింస అలవాటైన ఒక తప్పనిసరి పరిస్థితిని విజయ రాసింది. లైంగిక రాజీయ అర్థశాస్త్రాన్ని అర్థం చేసుకునే మార్గాలేవి? ఈ ప్రశ్నలు రేకెత్తిస్తుంది 'మంచినీళ్ళు' కథ. 'బచ్చాపౌచ్' కూడా లైంగిక పునరుత్పత్తులకు ఆర్థికంతో పడిన, పడుతున్న ముడులను మన గమనంలోకి తెచ్చే కథ. పునరుత్పత్తి రాజకీయాలను పౌర రాజకీయాలకంటే సంక్లిష్టంగా మార్చింది పితృస్వామ్య వ్యవస్థ. ఆ వ్యవస్థను అర్థం చేయించే కథలు రాస్తున్నారు. స్త్రీవాదులు. అలాంటి స్త్రీవాదులలో భండారు విజయ వున్నందుకు సంతోషం. - ఓల్గా, అక్కినేని కుటుంబరావు

Browse more Telugu books