క్రికెట్ అండ్ లవ్ / Cricket and Love
బి.ఎస్. జగదీశ్ / B.S. Jagadeesh · Novels

Price: Rs. 95. చిన్నతనంలో సైకిల్ నేర్చుకోవడానికి, బ్యాటు కొనుక్కోవడానికి తను కూడబెట్టుకున్న డబ్బు ఇచ్చి, ప్రోత్సహించిన అమ్మ- అప్పుల వాళ్ళు ఇంటికొస్తే, ఆ విషయం మాకు తెలీకూడదని గాభరాగా షర్టు ధరించి, మిట్ట మధ్యాహ్నం మండుటెండలో కాళ్ళకు చెప్పులు, నెత్తిన గొడుగు లేకుండా బైటికి వెళ్ళిన నాన్న- కుతురైనా, పెద్ద కొడుగ్గా బాధ్యత తీసుకొని, నాన్న చేసిన అప్పులు తీర్చి "అమ్మ" తరువాత ఆ స్థానాన్ని ఆక్రమించి, నా పురోగతికి పాటుపడిన అక్క కాలేజీలో రంగువెలసిన నాపాత డ్రస్సులు చూసి జాలిపడి, తనింటికి తీసుకువెళ్ళి, నాకు అవసరమైన కొత్త డ్రస్సులు అందివ్వడమే కాకుండా, అడిగిందే తడవుగా ఆర్థిక సహకారం అందించిన ప్రాణస్నేహితుడు ఆంజనేయులు.- సినిమాహాల్లో గేటు కీపర్ ఉద్యోగం చేస్తూ, తనకుటుంబం కోసం సంపాదించిన నెలరోజుల జీతంతో నా కాలేజీ ఫీజుకట్టిన ప్రియ మిత్రుడు. పెంచల్రావు (ఎక్కడున్నాడో తెలీదు)- టెండూల్కర్‌ను ఇన్ఫిరేషన్‌గా గా తీసుకొని ప్రతిష్టాకరమైన ఐ.ఐ.టి.లో సీటు సంపాదించి, ప్రస్తుతం ఎస్.టి.పి.సి.లో డిప్యూటీ మేనేజర్ పనిచేస్తున్న మా పెద్దబ్బాయి చి॥భాస్కరుని సంతోష్, సంగీత ప్రపంచంలో ఓ స్థానం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న మా రెండవ అబ్బాయి చి॥ భాస్కరుని సాయిచరణ్ (చెర్రీ).- అనుక్షణం నాకు ప్రోత్సాహాన్ని అందిస్తూ, కంటికి రెప్పలా కాపాడుతున్న నా శ్రీమతి మీనాకుమారి- మగవాళ్ళ జీవితాలతో ఆడుకొనే ఆడవాళ్ళ అకృత్యాలు- పెళ్లవగానే వేరే కాపురం పెట్టి, తల్లిదండ్రులనుంచి పిల్లల్ని వేరు చేసి, అటు తల్లిదండ్రుల, ఇటు పిల్లల మానసిక సంక్షోభానికి కారకులైన కసాయి ఆడవాళ్లు- సలహాలు, సూచనలు అందించిన మాజీ రంజీ క్రికెటర్ భూపతి గౌరీశంకర్- ఎందరో వ్యక్తులు, మరెన్నో సంఘటనలు ఈ నవలకు ప్రేరణ అని సవినయంగా మనవి చేసుకుంటూ, తొలిప్రచురణలో తప్పు లేవైనా గమనిస్తే, పెద్ద మనసుతో క్షమించవలసినదిగా అర్థిస్తూ- తప్పులు, సలహాలు తెలియజేస్తే, మలి ప్రచురణలో మార్పులు చేర్పులు చేయగలనని సవినయంగా విన్నవించుకుంటున్నాను. ఈ పుస్తక ప్రచురణకు సహకరించిన శ్రేయోభిలాషులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుం