కొకోరో / Kokoro

Dr. Srinivas Chakravarthy / డాక్టర్ శ్రీనివాస్ చక్రవర్తి · Novels

కొకోరో / Kokoro book cover

Price: Rs. 65. సొసెకీ నట్సుమే జపాన్ దేశపు అత్యుత్తమ రచయితల్లో ఒకరు. సాహితీ విమర్శకులు అమెరికన్ రచయిత హాథర్స్తోను, ఫ్రెంచి రచయిత విక్టర్ హ్యూగోలోను, ఆంగ్ల రచయిత చార్లెస్ డికెన్సుతోను ఈయన్ని పోలుస్తుంటారు. ఈయన 1867లో పుట్టాడు. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో చనిపోయాడు. ఆంగ్ల సాహిత్యంలో రీసెర్చి చేయడానికి ఇంగ్లాండు వెళ్ళాడు. ఇంగ్లండు నుంచి జపానుకు తిరిగి వచ్చాక కొంతకాలం తాను చదువుకొన్న విశ్వవిద్యాలయంలోనే నాలుగేళ్లపాటు ప్రొఫెసరుగా పనిచేశాడు. ఆ తర్వాత టోకియో ఆసాహి షింబూన్లో సాహిత్య శాఖ ప్రధానాచార్యులుగా చేరాడు. ఈ కాలంలోనే నవలలు రాయడం ప్రారంభించాడు. మొదటి నవల 'నేనొక పిల్లిని'. ఒక ప్రముఖ సాహిత్య పత్రికలో సీరియల్గా వెలువడింది. ఈ నవలలో ఒక ప్రొఫెసర్ జీవితం అతని ఇంటిలోని పిల్లి దృష్టితో చిత్రింపబడింది. ఆ పత్రికలో ఆ నవల ఆఖరు అధ్యాయంలో పిల్లి చనిపోయినట్లు చదివి పాఠకులు భోరున ఏడ్చారట! ఆయన ఆఖరి నవలల్లో 'కొకొరో' ఒకటి. ఆయన తొలి రచనల్లో తొంగిచూచిన హాస్యమూ ఆశావాదమూ మలిరచనల్లో మాయమయ్యాయి. వాటిల్లో నిరాశావాదం ప్రవేశించింది. కొకొరో పాత్రలు విధినీ జీవితంలో ప్రతికూలతనీ బొత్తిగా ప్రతిఘటించకుండా లొంగిపోతాయి. ఆయన రచనా సంవిధానంలో మ్కాతం పూర్తిగా పరిణతి కనిపిస్తుంది.

Browse more Telugu books