కులం-విప్లవోద్యమం / KULAM - VIPLAVODYAMAM

ఎన్.రవి / N. RAVI · Caste, Religion & Culture

కులం-విప్లవోద్యమం / KULAM - VIPLAVODYAMAM book cover

Price: Rs. 108. ప్రజా పంథాను అనుసరించి పని చేసే విప్లవ పార్టీ, సమాజంలోని ఏవైనా సెక్షన్లు కొత్త ప్రశ్నలను లేవనెత్తినప్పుడు, అవి ఫెమినిజం లేవనెత్తిన ప్రశ్నలైనా కావచ్చు, లేదా దళితవాదం లేవనెత్తిన ప్రశ్నలైనా కావచ్చు మరేవైనా కావచ్చు, వాటిని నిరాకరించక, వాటిలోని సకారాత్మకమైన విషయాలను స్వీకరించి, మార్క్సిస్టు దృక్పథంతో వాటిపై తమ విమర్శను ప్రకటించే దృక్పథమే చేపట్టింది. కాబట్టి దళితవాదం లేవనెత్తిన ప్రశ్నలు కూడా కుల సమస్యను కూలంకషంగా అధ్యయనం చేసి అర్థం చేసుకోవడానికి, విప్లవ పార్టీలు కులాల రద్దు కోసం చేపట్టవలసిన కార్యక్రమం పట్ల ఒక సమగ్ర దృక్పధాన్ని పెంపొందించుకోవడానికి ప్రేరణ కలిగించాయి. *** విప్లవ పార్టీ కుల సమస్యపై ప్రత్యేక డాక్యుమెంట్ను రూపొందించడంతోపాటు, కుల సమస్య పట్ల అవగాహనను, విప్లవానంతరం కూడా కులంపై ఎట్లా పోరాడి నిర్మూలించాలనే విషయాలను ఆ పార్టీ మౌలిక డాక్యుమెంట్లు అయిన పార్టీ కార్యక్రమం, వ్యూహం ఎత్తుగడలలో అంతర్భాగం చేసుకున్నాయి. *** కుల అణచివేత వ్యతిరేక పోరాటాన్ని నూతన ప్రజాస్వామిక విప్లవంలో భాగంగా నడపాలి. కుల వివక్ష, పీడన తాలూకు అన్ని రూపాలతోనూ పోరాడటం ద్వారా సామాజిక జీవనానికి సంబంధించిన అన్ని రంగాలలోనూ పీడిత కులాల వారికి సమాన హెూదా కోసమూ, కుల వ్యవస్థను సమూలంగా నాశనం చేయడానికీ పోరాడాలి.. *** నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేసి కుల వ్యవస్థకు పునాదిగా పనిచేస్తున్న కుల ఆధారిత భూస్వామ్య విధానంతో పాటు దానికి దన్నుగా నిలిచి నిలబెడుతున్న దళారీ నిరంకుశ పెట్టుబడిదారీ విధానాన్నీ, సామ్రాజ్యవాదాన్ని కూలదోసి శాశ్వతంగా కులవ్యవస్థ నిర్మూలనకు కావలసిన భౌతిక పరిస్థితులను సృష్టించాలి.

Browse more Telugu books