కాళిదాసు మూడు నాటకాలు / Kalidasu moodu Natakalu

దోనెపూడి రామాంజనేయ శర్మ / Donepudi Ramanjaneya Sharma · New Arrivals

కాళిదాసు మూడు నాటకాలు / Kalidasu moodu Natakalu book cover

Price: Rs. 157. ఇవి మహాకవి కాళిదాసు ముచ్చటగా రాసిన మూడు నాటకాలు. మొదటి నాటకం: చారిత్రిక కథా వస్తువుగల మాళవికాగ్నిమిత్రం. శృంగార నాయకులలో ఒకరైన దక్షిణనాయకుడిగా అగ్నిమిత్రుని కాళిదాసు తీర్చిదిద్దిన వైనం అనితర సాధ్యం. రెండవ నాటకం: విక్రమోర్వశీయం. దేవతలకూ మానవులకూ చిరకాలంగా వస్తున్న సంబంధాలను చక్కగా చిత్రించాడు కాళిదాసు. నరుడైన పురూరవుడు నాయకుడు. అప్సరస ఊర్వశి నాయకి. వారిరువురి మధ్య సాగిన రమణీయమైన ప్రేమకావ్యమిది. ఇక మూడవ నాటకం: అభిజ్ఞాన శాకుంతలం. ప్రపంచ నాటక సాహిత్యంలోనే మణిపూస. దేశవిదేశ భాషల్లోకి అనువాదమయింది. అసంఖ్యాక సాహితీప్రియుల మనస్సులను చూరగొంది. నాయకుడు దుష్యంతుడు. నాయిక శకుంతల. కాళిదాసుతో కాలం గడపండి మరి.

Browse more Telugu books