కాల యంత్రం / TIME MACHINE

కె.బి.గోపాలం / K.B. Gopalam · Novels

కాల యంత్రం / TIME MACHINE book cover

Price: Rs. 95. పందులకు రెక్కలొస్తే.. వాటిలో ఒకటి ఎగురుతూ మీవైపే రాకెట్ దూసుకొస్తూంటే.. ఏమవుతుంది? హఠాత్తుగా మీరు గాడిదలా మారిపోతే.. ఆ విషయం ఎవరితోనూ చెప్పుకోడానికి బొత్తిగా అవకాశమే లేకపోతే.. అప్పుడేమవుతుంది? మీకు తెలిసిన మనుషులంతా మీ కళ్లముందే ఎలుకలుగా పిల్లులుగా కుక్కలుగా పులులుగా సింహాలుగా మారిపోతూ ఉంటే.. ఆగండాగండి. గతంలోకీ భవిష్యత్తులోకీ ఎడా పెడా మిమ్మల్ని తీసుకుపోయి వెనక్కి తీసుకురాగల ఒక కాలయంత్రమే మీకు లభిస్తే.. ఏమవుతుంది? పందులకు రెక్కలొస్తాయేమో, కాని కాలయానం మాత్రం అసాధ్యం అని మీరు అనవచ్చు. అయితే తన భావనలే వెల్స్కి ప్రధానం. వాటికి శాస్త్రీయ ఆధారం ఉందా లేదా అన్నది హెచ్ జి వెల్స్కి పట్టదు. భవిష్యత్తులో మానవ సమాజం ఎలా ఉండబోతోందో మీ కళ్ల ముందు ఆవిష్కరించడమే ఈ నవలలో ఆయన ముఖ్య లక్ష్యం. శాస్త్రపరమైన వివరాలను ఆయన అంతగా పట్టించుకోడు. అయినా ఆయనకు సైన్సు కథా పితామహుడు అన్న పేరుంది. Sci-Fic అనగానే మీకు వెల్స్ పేరు గుర్తు రాక మానదు. కాల యంత్రం (Time Machine) పుట్టి శతాబ్దం దాటింది. అప్పటికీ ఇప్పటికీ దాని ఆకర్షణ శక్తి ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ అది పాఠకులను అలరిస్తూనే ఉంది. వివాదాలను రేపుతూనే ఉంది.

Browse more Telugu books