కాలబిలాలూ పిల్లవిశ్వాలూ / kaalabilaaloo pilla viswaaloo
యం. విజయకుమార్ , ఎ. గాంధీ / M.VIJAY KUMAR , A. GANDHI · Education & Science

Price: Rs. 135. ఇది వ్యాసాల సంకలనం. ఇందులో పదమూడు వ్యాసాలూ ఒక ఇంటర్వ్యూ ఉన్నాయి. సుప్రసిద్ధ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ అమూల్య రచనలివి. సైన్సు వ్యాసాలంటే నీరసంగా ముసురుగా ఉంటాయనుకుంటారేమో! హాకింగ్ చెప్పిన తీరు అమోఘం. అందులో ఒక సొగసుంది. హాస్యం ఉంది. కనీకనిపించకుండా వ్యంగ్యం ఉంది. అన్నిటినీ మించి అన్వేషణ ఉంది. సైన్సు వాస్తవం సైన్సు కథలకంటె ఉత్తేజకరంగా ఉంటుందని హాకింగ్ రుజువు చేస్తాడు. మనని కాలబిలంలోకి నెట్టి ఎలా ఉందో చెప్పమంటాడు. కాలబిలంలో దూకి శ్వేతబిలంలో తేలవచ్చునా అని చర్చిస్తాడు. అసంఖ్యాకమైన పిల్ల విశ్వాల గురించి చెప్పి మనల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతాడు. ఈ చరాచర జగత్తుకి మనమే ప్రభువులమా? ఎన్నటికీ దేనినీ తెలుసుకోలేని నిరర్ధక జీవులమా? మనం చెయ్యలేని దాని గురించి వగచేకంటే సాహసించడమే మేలు. అన్వేషణే మన లక్ష్యం అంటాడు హాకింగ్.