Karl Marx Adhanapu Viluva Siddanthalu ('petubadi' nalgava samputi ) volume -2

Editor · Politics

Karl Marx Adhanapu Viluva Siddanthalu ('petubadi' nalgava samputi ) volume -2 book cover

Price: Rs. 750. కార్ల్ మార్క్స్ 1861–63 మధ్య రచించిన "అదనపు- విలువ సిద్ధాంతాలు" లోని, రెండవ భాగం ఇది. మొదటి భాగంకంటే పెద్దదైన ఈ భాగంలో, 11 అధ్యాయాలు, 4 చిన్న అనుబంధాలు ఉంటాయి. దీనిలో, ప్రధానంగా రికార్డో వ్యవస్థపై విమర్శణాత్మక విశ్లేషణ, అలానే కొన్ని అంశాల్లో, ఆడం స్మిత్ రచనల విశ్లేషణా వుంటాయి. రికార్డో అద్దె-సిద్ధాంతంలో నిరపేక్ష-అద్దె భావన లోపిస్తుంది. దీన్ని అభివృద్ధిచేయ తలంచిన రాడ్బెర్టన్ ప్రయత్నాల్లోని డొల్లతనాన్ని విశ్లేషిస్తూ, మార్క్స్ ఈ భాగాన్ని ఆరంభిస్తాడు. రికార్డో పద్ధతిలోని ప్రధాన లోపాల్ని మార్క్స్ ఇలా బయల్పరుస్తాడు : (1) సగటు లాభం-రేటు నియమాన్ని', 'విలువ నియమం'తో లంకె కలవటంలో రికార్డోకి గల అశక్తత, (2) 'మార్కెట్ విలువ' ఏర్పడే విధాన్ని, 'సగటు లాభం- రేటుని సమానీకరించే విధం'గా భావించి గందరగోళపడటం, (3) 'అదనపు విలువ నియమాల'ను, 'లాభం నియమాలు'గా భావించి గందరగోళపడటం. ఈ క్రమంలో 'అద్దె'పై చారిత్రక ప్రతిపాదనల్ని నిశితంగా విశ్లేషిస్తాడు. ఆ తర్వాత, వాటిపై చేసిన సుదీర్ఘ విశ్లేషణలనుండి మార్క్స్ తన 'అద్దె-సిద్ధాంతాన్ని' నిర్మిస్తాడు. అమితోత్పత్తి, అల్పోత్పత్తి, వినియోగం, వగైరా అంశాలపై బూర్జువా ఆర్థికవేత్తల సిద్ధాంత సమర్ధన-లోని డొల్లతనాన్ని ఎండగడుతూ, 'సంక్షోభాల' గురించి సుదీర్ఘ చర్చ, విశ్లేషణ చేస్తాడు మార్క్స్, అలానే, అందరూ చర్చించే రికార్డో చెప్పిన 'పతనమయ్యే లాభం- రేటు నియమం' గురించి విస్తారంగా చర్చిస్తూ, దానిలోని లోపాన్ని ఈ రెండవ భాగంలో పూర్తిగా, అద్భుతంగా తేటతెల్లపరుస్తాడు మార్క్స్. "పెట్టుబడి" గ్రంథంలో పూర్తి వివరంగా చేయని విశ్లేషణలు గల మౌలిక ఆర్థిక అభివర్గాలైన మార్కెట్ - ధర, వ్యయ-ధర, మార్కెట్ - విలువ, లాభం, అదనపు విలువ, లాభం-రేటు, అదనపు-విలువ రేటు, అద్దె, భూమి-అద్దె. నిరపేక్ష- అద్దె, సాపేక్ష-అద్దె, శ్రమ, శ్రమ-శక్తి, విలువ "ల గురించి వివిధ ఆర్థికవేత్తల నుండి విస్తారంగా ఉదహరిస్తూ, నిశిత విశ్లేషణ చేస్తాడు మార్క్స్. ఈ సందర్భంగా, మార్క్స్, దశలవారీగా చేసే విశ్లేషణలో, చిన్న విలువల్ని తీసుకుంటూ లెక

Browse more Telugu books