కార్పొరేట్ల నెత్తుటి క్రీడా మైదానం బస్తర్ -ఆపరేషన్ కగార్ / Corporates' bloody playground Bastar - Operation Kagaar

Editor · Politics

కార్పొరేట్ల నెత్తుటి క్రీడా మైదానం బస్తర్ -ఆపరేషన్ కగార్ / Corporates' bloody playground Bastar - Operation Kagaar book cover

Price: Rs. 95. అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన భారతదేశం 78 ఏళ్ల స్వతంత్ర పాలన తర్వాత గర్వంగా తలెత్తుకుని ప్రపంచ దేశాల్లో ఒక అత్యున్నత స్థానంలో ఉండాల్సింది. స్వాభావికంగా ఉన్న సాంఘిక, మతపరమైన భిన్నత్వం ప్రజలు కేంద్రంగా ప్రజాస్వామ్యానికి ఒక తలమానికంగా ఉండాల్సింది కాని మానవ హక్కుల ఉల్లంఘనలో అత్యంత అప్రజాస్వామిక స్థితిలోకి దిగజారిపోయాం. దేశంలో ఏ మూలన చూసుకున్నా అణచివేతకు పరాకష్టగా మునుషులను వేటాడే అధమస్థాయికి దేశం దిగజారిపోయింది. ఎటుచూసిన హక్కుల ఉల్లంఘనలు మనకు కనపడుతాయి. అయితే సహజ వనరులు అపారంగా ఉన్న ప్రాంతాలలోని ప్రజలను భయకంపితులను చేసి అక్కడ నుండి వారిని వెళ్ళగొట్టేందుకు వారిపై అమలవుతున్న దాడి ఆ ప్రాంతాల్లోని సహజమైన, స్వచ్ఛమైన అడవులను, భూమిని, గాలిని, నీటిని కోలుకోలేనంత కలుషితం చేయడంతో పాటు వాటితో శతాబ్దాలుగా కలియ తిరుగుతున్న మనుషులను, వారి సంస్కృతిని అడవితో వారికున్న అవినాభావ సంబంధాన్ని నాశనం చేయడాన్ని మనం చూస్తున్నాం. ఈ ఉపోద్ఘాతం విస్తీర్ణంలో కేరళ రాష్ట్రంతో సమానంగా 40 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో వ్యాపించిన ఆదివాసీల బస్తర్ గురించే అని మీకు స్ఫురించే వుంటుంది. ఐస్తర్ అందానికి దాని భూగర్భంలో దాచుకున్న అపార ఖనిజ సంపద వారికే శత్రువైంది. ఆదివాసీలకు ఆ భూగర్భంలోని సంపద మీద ఎప్పుడూ ఆశలేదు. కాని అభివృద్ధి పేర తరతరాలుగా వారు జీవిస్తున్న భూమిని, అడవిని నాశనం చేయడాన్ని చూడలేక ప్రాణాలకు తెగించి ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్రకృతితో పెనవేసుకుని పోయిన వారి వారసత్వ సంపదలో వారి దేవుళ్లను, వారి పూర్వీకులను, ఆ చెట్లను, రాళ్ళను విస్తారంగా ఆ ప్రాంతమంతా విస్తరించిన పర్వతాలను, గలగలా పారుతూ గతాన్ని నిత్యనూతనంగా చూపిస్తున్న నదులను స్వేచ్ఛగా తమ గూడేలను పలుకరిస్తూ తిరుగుతున్న పక్షుల నుండి అభివృద్ధి పేర జరుగుతున్న దోపిడీలో స్థానికుల నుండి బలవంతంగా గుంజుకోబడుతూనే ఉన్నాయని చరిత్ర మనకు చెబుతూనే ఉంది. ఈ ప్రకృతి సంపదతో పాటు వీటితో పెనవేసుకుని పోయిన ఆదివాస్ జీవితాలను వారి కాళ్ళకింద ఉన్న ఇనుప ఖనిజ నిలువలు, టిన్,

Browse more Telugu books