కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి ఏరిన రచనలు / Comrade Chandra Pullareddy yerina rachanalu

చండ్ర పుల్లారెడ్డి/ Chandra Pullareddy · Politics

కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి ఏరిన రచనలు / Comrade Chandra Pullareddy yerina rachanalu book cover

Price: Rs. 270. అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమం నుండి ముఖ్యంగా రష్యా అక్టోబరు విప్లవం నుంచీ, మహత్తర చైనా విప్లవం నుంచీ సరైన పాఠాలు తీసుకోలేదు. మన రైతాంగ పోరాటాల యొక్క ముఖ్యంగా మహత్తర తెలంగాణా పోరాటం యొక్క పాఠాలను అధ్యయనం చెయ్యలేదు. వాటి నుండి పాఠాలు తీయలేదు. మన విప్లవ విజయం ప్రధానంగా భారతదేశంలో వుండే పరిస్థితులపైన, భారత ప్రజల పోరాటాలపైన ఆధారపడి వుంటుంది. అందుకు మనం ఓపిగ్గా పనిచేయాలి. పోరాటపు అన్ని దశల్లోనూ మనమెల్లపుడు విప్లవ రాజకీయాలను ప్రచారాన్ని, ప్రజా సమీకరణను, ప్రజా ప్రతిఘటనను, పార్టీ నిర్మాణాన్ని జోడించి పనిచేయాలి. అవి పరస్పర సంబంధం గలవి. వాటిని వేరు చేయకూడదు. మనది అర్ధవలస--అర్ధ భూస్వామ్య దేశం. ఇక్కడ చిన్నతరహా ఆర్ధిక వ్యవస్థ (ముఖ్యంగా వ్యవసాయరంగంలో) వుంది. అందువల్ల మన సమాజంలో పెటీ బూర్జువా ఆలోచనా విధానం అధికంగా వుంటుంది. మన పార్టీ సభ్యుల పైనా, నాయకత్వంపైనా కూడా ఈ పెటీ బూర్జువా ఆలోచనా విధానం అధిక్యత సాధించింది. తీవ్రమైన నష్టాలు, నిర్బంధం ఎదురైతే ఈ పెటీ బూర్జువా శక్తులు అతివాదం వైపు ఎంత తేలిగ్గా కొట్టుక పోయారో అంతే తేలిగ్గా మితవాదం వైపు మొగ్గుతారనీ, మితవాద పెడధోరణి వైపుకూ, రివిజనిజం వైపుకూ పోతారనే విషయం మనం జాగ్రత్తగా దృష్టిలో వుంచుకోవాలి. ప్రతీ రాష్ట్రంలోనూ గల ఉద్యమ స్థాయినీ, ఓపికగా అధ్యయనం చెయ్య లేదు. సర్వసాధారణ పాఠాలు తీసుకున్నారు. ప్రతి ప్రాంతంలోని ప్రత్యేక పరిస్థితులకు తగ్గట్టుగా నిర్దిష్ట కర్తవ్యాలను రూపొందించుకోలేదు. ప్రతి ప్రాంతంలోనూ ప్రజల పోరాట చైతన్యాన్ని, వారి సన్నద్ధతను దృష్టిలో వుంచుకోలేదు. ప్రజాపంథాపై ఆధారపడి ప్రజాయుద్ధం కొరకు పట్టుదలతో పోరాడిన ఫలితంగానే మన పార్టీ - భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు-లెనినిస్టు), దాని నాయకత్వాన వున్న విప్లవోద్యమం మనకు లభించాయి. వివిధ దశల్లో పార్టీలో వచ్చిన అతివాద దుందుడుకు వాదానికి, వర్గ సామరస్య పంథాకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో మనం కూడా కొన్నిసార్లు బలహీనతలకు గురైనప్పటికీ, ముఖ్యంగా మనం నిరంతరం జరిపిన రాజకీయ, సిద్ధాంత పోరాటాల ఫలితంగానే

Browse more Telugu books